మంచుకొండల్లో అన్నదానం.. పుణ్యకార్యం
అమర్నాథ్లో సిద్దిపేట లంగరు ఏర్పాటు చేసి, మంచుకొండల్లో అన్నదానం చేయడం ఒక గొప్ప పుణ్యకార్యం అని, అమర్నాథ్ సేవా సమితి చేస్తున్న ఈ మంచి పని ఎందరికో ఆదర్శం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట శరభేశ్వర దేవాలయం వద్ద అమర్నాథ్ యాత్రకు వెళ్లే సరుకుల వాహనాన్ని సోమవారం ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌తో కలిసి హరీశ్‌రావు ప్రారంభించారు.
- అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సేవలు అభినందనీయం
- సిద్దిపేట ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు నెలవు
- దక్షిణాదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సిద్దిపేట అమర్నాథ్ సేవా సమితి
- అమర్నాథ్లో సిద్దిపేట లంగర్‌కు ప్రత్యేక స్థానం
- ఈనెల 19న సిద్దిపేటలో గోసంరక్షణపై చాగంటి ప్రవచనాలు
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
- అమర్నాథ్ సరుకుల లారీని ప్రారంభించిన హరీశ్‌రావు
సిద్దిపేట, జూన్ 15 : అమర్నాథ్లో సిద్దిపేట లంగరు ఏర్పాటు చేసి, మంచుకొండల్లో అన్నదానం చేయడం ఒక గొప్ప పుణ్యకార్యం అని, అమర్నాథ్ సేవా సమితి చేస్తున్న ఈ మంచి పని ఎందరికో ఆదర్శం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట శరభేశ్వర దేవాలయం వద్ద అమర్నాథ్ యాత్రకు వెళ్లే సరుకుల వాహనాన్ని సోమవారం ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌తో కలిసి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేట అంటే ఎకడికి వెళ్లినా ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. తిరుపతి, శ్రీశైలం, కేదార్నాథ్, అమర్నాథ్లో సిద్దిపేట వాసులు అన్నదానం చేయడం గొప్ప విషయం అన్నారు.
తెలుగువారికి అన్నం, మామిడికాయ తొకు అంటే ప్రత్యేక అభిమానం అని అన్నారు. దక్షిణ భారత్‌లో అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. 15ఏండ్లుగా ఇలాంటి గొప్ప కార్యక్రమం చేపట్టం అభినందనీయం అని, అందరి సహకారంతో సరుకులతో లారీని అమర్నాథ్కు పంపుతున్నామని తెలిపారు. సిద్దిపేట ఆధ్యాత్మిక, ధార్మిక సేవకు మారుపేరని, అందులో వైశ్యులు ముందు ఉంటారని హరీశ్‌రావు అన్నారు.

ఆధ్యాత్మికతో మనసుకు ప్రశాంతత లభిస్తుందన్నారు. మానవ సేవే మాధవ సేవ అన్నారు. మీరు చేస్తున్నది పుణ్యం కార్యం అని అన్నారు. ఈనెల 19న ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సిద్దిపేటలో గో సంరక్షణ యజ్ఞం తలపెట్టారని.. గో సంరక్షణపై వారి ప్రవచనాలు సిద్దిపేట వైశ్య కన్వెన్షన్ హాల్లో జరుగుతాయని హరీశ్‌రావు చెప్పారు. ఇలాంటి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు.
ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మనసు కొండల్లో సిద్దిపేట సేవాగుణం జెండా ఎగుర వేస్తున్నారని, మనిషి బండరాయిలా ఉండొద్దని, అందరికీ అన్నం కావాలనే సందేశాన్ని ఇస్తున్నదని, ఆ సందేశాన్ని అమర్నాథ్ సేవా సమితి అందుకున్నదని, ఆకలి తీర్చే అన్నదాన సేవా సమితి ..ఆపద తీర్చే హరీశ్‌రావు ఉన్నారని అన్నారు. నిత్యం ప్రజల వెన్నంటే ఉండే హరీశ్‌రావు.. సిద్దిపేట ప్రజలను విడిచి ఉండలేరన్నారు. అమర్నాథ్ సేవా సమితి ఇంకా విస్తరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, సుడా మాజీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, అమర్నాథ్ అన్నదాన సేవా సమతి అధ్యక్షుడు నందిని శ్రీనివాస్, నవీన్, గంప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

