జిన్నారం, జూన్ 29 : బొల్లారం పారిశ్రామిక వాడలోని పలు రసాయన పరిశ్రమల నుంచి కొన్ని రోజులుగా విష వాయువులు వాయు కాలుష్యానికి కా రణమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పరిశ్రమల పొగ గొట్టాల నుంచి వాతావరణంలోకి విడుదలైన వాయువులు ఘాటైన వాసనలతో ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని వాపోతున్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు ఘాటైన వా సనలు ఉకిరి బికిరి చేస్తున్నా యని భయాందోళన వ్యక్తం చేస్తు న్నారు.