రామాయంపేట, నవంబర్ 24 : వరి పంట దిగుబడి రాకపోవడంతో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు బాధిత రైతు ఫిర్యాదు చేశాడు. మండలంలోని ఆర్.వెంకటాపూర్ గ్రామానికి ఎరువాక, ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు రైతు అభిలాష్‌రెడ్డి వరిపంట పొలాన్ని సందర్శించారు. ఈ సం దర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. వరి పంట ను పూర్తిగా పరిశీలించామన్నారు. ఎరువాక సం గారెడ్డి, జయశంకర్ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌కు నివేదికను అందజేసి, రైతుకు న్యాయం జరిగేలా ప్రయ త్నం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏడీఏ వసంతసు గుణ, ఏవో రాజ్‌నారాయణ, శాస్త్రవేత్తలు విజయ్, ఉమారాణి, రాహుల్ పాల్గొన్నారు.