చేర్యాల, సెప్టెంబర్ 29 : రైతు సేవ, రైతు ఉ త్పత్తిదారుల సంస్థతో రైతన్నలకు ఎంతో మే లు జరుగుతుందని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మండలంలోని నాగపురి గ్రా మంలో ఆదివారం రైతు సేవ రైతు ఉత్పత్తిదారులు సంస్థ లిమిటెడ్ మూడో మహాసభ జ క్కుల తిరుపతి అధ్యక్షతన జరిగింది. ఈ సం దర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సహకారం ఎస్‌ఎఫ్‌ఏసీ, ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాగపురి రైతు సేవ, రైతు ఉత్పత్తిదారుల సం స్థ సేవలు బాగున్నాయని అన్నారు.
కార్యక్రమంలో ఏకలవ్య ట్రస్టీ రిటైర్డ్ జిల్లా వ్యవసా య అధికారి అమరేశ్, ట్రస్టీ కాశీనాథ్, మం డల వ్యవసాయ అధికారి బోగేశ్, మాజీ స ర్పంచ్ సంతోషికరుణాకర్, కృష్ణవేణి, నల్లపోచమ్మ ఆలయ చైర్మన్ గూడెపు మహేశ్, ఎఫ్‌పీవో కార్యదర్శి గుండ్రెడ్డి గురువారెడ్డి, కోశాధికారి బండకింది బాపురాజు, డైరెక్టర్లు చెప్యా ల గణేశ్, కత్తుల శ్రీనివాస్‌రెడ్డి, రవికుమార్, కనకమ్మ, నవనీత, అనిత, మహేందర్, న ర్సింహులు, రాములు పాల్గొన్నారు.