సిద్దిపేట కలెక్టరేట్, అక్టోబర్ 21: అర్జీదారుల సమస్యలపై ప్రత్యేక చొరవ చూపి అధికారులు సత్వరమే పరిష్కరించాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. సోమవారం సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన అర్జీదారుల నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణి అనేది గొప్ప కార్యక్రమమని, సామాన్యులకు అధికారులు అందుబాటులోఉండి సమస్యలను పరిష్కరిస్తారన్నారు. ప్రతిఒక్కరికీ న్యాయం చేసే విధంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. భూ సంబంధిత, ఇండ్లు, ఆస రా పింఛన్లపై 50 దరఖాస్తులు వచ్చాయి. కా ర్యక్రమంలో డీఆర్వో లక్ష్మీకిరణ్, డీఆర్డీవో జయదేవ్‌ఆర్యా, అధికారులు పాల్గొన్నారు.