రాయపోల్ : అధికారులు సమయపాలన ( Timeline ) పాటించి విధులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హైమావతి ( Collector Haimavati ) అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. బుధవారం రాయపోల్ మండల( Raipol) కేంద్రంలోని
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ( PHC ) ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అటెండెన్స్ రిజిస్టర్, ఓ పి రిజిస్టర్, విసిట్ రిజిస్టర్లను ఆమె పరిశీలించారు. సంబంధిత వైద్యురాలు దుబ్బాక లో మీటింగ్ వెళ్లారని సిబ్బంది తెలపగా స్థానిక అధికారులతో మాట్లాడి నిజనిర్ధారణ చేశారు.
ల్యాబ్ సిబ్బందితో శాంపిల్స్ టి-హబ్ కి పంపిస్తున్నారా అని అడిగి రాండమ్ టెస్ట్ లు చేస్తున్నారని ఆరా తీశారు. ర్యాపిడ్ టెస్టులు తప్పనిసరిగా పీహెచ్సీలోనే చేయాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో రెవెన్యూ సదస్సుల డిస్పోజల్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మండలంలో 393 ఇండ్లు మంజూరు కాగా 225 గ్రౌండింగ్ అయ్యాయని ఎంపీడీవో బాలయ్య కలెక్టర్కు వివరించారు. పీఎంఏవై యాప్లో రోజు వారిగా టార్గెట్ పెట్టుకుని అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. హౌసింగ్ డీఈ పర్యవేక్షణ పెండింగ్ ఉందా, పేమెంటులు వస్తున్నాయని ఆరా తీయగా బ్యాంక్ అకౌంట్లో సాంకేతిక సమస్యలు ఉంటే ఈ-కేవైసీ చేయించుకోవాలని సూచించారు.
మండల కేంద్రం లో బొడ్డు సంతోష ఇంటి నిర్మాణాన్ని పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగంగా ఇంటి నిర్మాణం పూర్తి చెయ్యాలని సూచించారు. వనమహోత్సవం టార్గెట్ను వంద శాతం పూర్తి చెయ్యాలని ఎంపీడీవోను ఆదేశించారు. మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక సందర్శించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ కృష్ణ మోహన్, ఎంపీవో శ్రీనివాస్. ఎంఈవో సత్యనారాయణ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి నరేష్, ఆర్ఐ రాజమల్లు. వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.