రాయపోల్, మే 28: అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దుబ్బాక ఏడీఏ శ్యామ్‌సుందర్ హెచ్చరించారు. మంగళవాంర దౌల్తాబాద్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఉన్న ఫర్టిలైజర్ దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఆయన వెంట దౌల్తాబాద్ ఏవో గోవిందరాజులు, ఏఈవో ప్రశాంత్ ఉన్నారు.
అక్కన్నపేట, మే 28: విత్తనాలు కొనుగోలులో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏఈవోలు శ్రీలత, సబిహా సూచించారు. మండల కేంద్రంతో పాటు జనగామ, గుబ్బడిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
మద్దూరు(ధూళిమిట్ట), మే 28: వానకాలంలో పంటల సాగుకు ముందు రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని ఏఈవో రాకేశ్ అన్నారు. మద్దూరు మండలంలోని ధర్మారంలో విత్తన కొనుగోళ్లపై రైతులకు అవగాహన కల్పించారు. మాజీ సర్పంచ్‌లు రవీందర్‌రెడ్డి, బాలయ్య పాల్గొన్నారు.
మిరుదొడ్డి, మే 28 : ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా దుకాణాల్లో నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మిరుదొడ్డి ఏవో బోనాల మల్లేశం అన్నారు. మిరుదొడ్డి టౌన్‌లోని ఆయా ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆకస్మికంగా ఆయన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రికార్టులను పరిశీలించారు. ఏఎస్సై బిక్యానాయక్, ఏసీవోలు లోహిత్, సాయికుమార్, పోలీసు సిబ్బంది రవి పాల్గొన్నారు.
వర్గల్, మే 28: విత్తన ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని వర్గల్ వ్యవసాయాధికారి శేషశయన తెలిపారు. మండలకేంద్రంతో పాటు సింగాయిపల్లి, గౌరారం, నెంటూర్, గిర్మాపూర్, గోవిందాపూర్, శాకారంలో ఏఈవోలు సంతోష్, సుప్రజాతేజస్వితో కలిసి ఆమె రైతులకు కల్తీ విత్తనాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వానకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంంలో రైతులు తప్పకుండా నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
బెజ్జంకి, మే 28: మండలంలోని దేవక్కపల్లి, వీరాపూర్, తోటపల్లి, గూడెం, వడ్లూర్, చీలాపూర్పల్లి, తిమ్మాయ్యపల్లిలో వానకాలం పంటల సాగుపై వ్యవసాయాధికా రులు రైతులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం గుర్తించిన విత్తనాలను మాత్రమే రైతులు కొనుగోలు చేయాలని సూచించారు. రసాయన ఎరువులకు బదులు సేంద్రియ ఎరువులు వాడాలన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు రేణుకశ్రీ, భరత్, మౌనిక, మానస, రచన, సాయిశంకర్, రైతులు పాల్గొన్నారు.
కొండపాక(కుకునూరుపల్లి), మే 28: కొండపాక మండలంలోని పలు గ్రామాల్లో ఫర్టిలైజర్ దుకాణాలను విజిలెన్స్ ఎస్సై సాయిమ్ ప్రేమ్‌దీప్, గజ్వేల్ ఏడీఏ బాబునాయక్, వ్యవసాయ శాఖాధికారులతో కలిసి తనిఖీ చేశారు. సందర్భంగా స్టాక్ రిజిస్టర్, డెలివరీ రిజిస్టర్ బిల్ బుక్‌లతో పాటు దుకాణాల్లో ఉన్న విత్తనాలు, ఎరువులను పరిశీలించారు. కార్యక్రమంలో ఏవో ప్రియదర్శిని, ఏఈవో రమ్యశ్రీ పాల్గొన్నారు.
అక్కన్నపేట, మే 28: మండలంలోని గౌరవెల్లి, గుబ్బడి, అక్కన్నపేటలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో వ్యవసాయశాఖ అధికారులు, స్థానిక పోలీసులు కలిసి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా దుకాణాల్లో విత్తన సంచులను పరిశీలించారు. ఎస్సై వివేక్, ఏఈవో శ్రీలత, సబిహ పాల్గొన్నారు.
కొమురవెల్లి, మే 28: మండలంలో రైతులకు సరిపడ జీలుగ విత్తనాలు అందుబాటులో ఉంచాలని సీపీఎం మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి విమర్శించారు. మంగళవారం కొమురవెల్లిలో సీపీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే జీలుగ విత్తనాలు మండలంలో కొరత వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు తాడూరి రవీందర్, అత్తిని శారద, మండల నాయకులు తేలు ఇస్తారి, తాడూరి మల్లేశం, ఉల్లంపల్లి సాయిలు, ఆరుట్ల రవీందర్, ఎల్లయ్య పాల్గొన్నారు
.