చకచకా..ఎన్నికల ఏర్పాట్లు
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా లో ఎన్నికల నిర్వహణకు అధికారులు వేగంగా ఏర్పాట్లు చేపడుతున్నారు.
- 1594 పోలింగ్ కేంద్రాల్లో వసతులపై సర్వే
- సెక్టార్ ఆఫీసర్లతో ఆర్డీవోల సమావేశం, ఫ్లయింగ్ స్కాడ్‌ల ఏర్పాటు
- పోస్టల్బ్యాలెట్లు, ఎన్నికల సామగ్రి సేకరణపై ప్రత్యేక దృష్టి
- దివ్యాంగులు, 80 ఏండ్ల దాటిన వారికి ఇంటి వద్దే రహస్య ఓటింగ్
సంగారెడ్డి అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ): ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా లో ఎన్నికల నిర్వహణకు అధికారులు వేగంగా ఏర్పాట్లు చేపడుతున్నారు. జిల్లా ఎన్నికల అధికారి శరత్ ఆదేశాలతో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు. సంగారెడ్డి, జహీరాబాద్, అందోలు, పటాన్చెరు, నారాయణఖేడ్ నియోజకవర్గాల రిటర్నింగ్ ఆఫీసర్లు బుధవారం సెక్టార్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కోసం రిటర్నింగ్ ఆఫీసర్లు తమ పరిధిలో ప్రత్యేకంగా ఫ్ల్లయింగ్ స్కాడ్లను ఏర్పా టు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో వసతులు, పోస్టల్బ్యాలెట్లు, ఎన్నికల సామగ్రి సేకరణపై రిటర్నిం గ్ ఆఫీసర్లు దృష్టి పెట్టారు. జిల్లా ఎన్నికల అధికారి శరత్ ఆదేశాల మేరకు రిటర్నింగ్ ఆఫీసర్లు ఈవీఎంలను భద్రపర్చేందుకు అవసరమైన స్ట్రాంగ్‌రూమ్‌లను గుర్తిస్తున్నారు.
పోలింగ్ కేంద్రాల్లో వసతులపై దృష్టి
సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 1594 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నా రు. సంగారెడ్డి అసెంబ్లీ పరిధిలో 281 పోలింగ్ కేంద్రాలు, నారాయణఖేడ్ అసెంబ్లీలో 296, ఆందోల్‌లో 313, పటాన్చెరులో 391, జహీరాబాద్‌లో 313 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ అన్ని పోలింగ్ కేంద్రాల్లో కరెం టు సౌకర్యం, తాగునీరు, టాయిలెట్లు, ర్యాం పులు ఉండాలని నిబంధలను విధించింది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లాలోని 15 94 పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులను గుర్తించేందుకు బుధవారం ఎన్నికల సిబ్బంది, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు బృందం పోలింగ్ కేంద్రాల్లో సర్వే నిర్వహించింది. 1594 పోలింగ్ కేంద్రాల్లో అధికారు లు సర్వే నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో సరైన వసతులు లేనిపక్షంలో వాటిని గుర్తించి జిల్లా ఎన్నికల అధికారి శరత్‌కు నివేదిక ఇవ్వనున్నారు. వసతులు లేనిపక్షంలో కల్పన కోసం కలెక్టర్ నిధులు మంజూరు చేయనున్నారు.
80 ఏండ్లు దాటితే ఇంటి వద్దే ఓటు
దివ్యాంగులు, 80 ఏండ్లు దాటిన వారు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పిస్తోంది. ఎన్నికల కమిషన్ తొలిసారిగా దివ్యాంగులు, 80 ఏండ్లు దాటిన వారు బ్యాలెట్ పద్ధతిలో ఓటువేసేందుకు అవకాశం కల్పిస్తుంది. జిల్లాలో 80 ఏండ్లు దాటిన ఓటర్లు 11,787 మంది ఉన్నారు. దివ్యాంగుల్లో ఓటర్లు 5వేల మందికిపైగా ఉన్నట్లు సమాచారం. సాధారణ ఎన్నికలకు ఒకరోజు ముందు వీరు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో రహస్య ఓటు వేయవచ్చు. పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేయాలనుకునే దివ్యాంగులు, 80 ఏండ్లు దాటిన వారు ముందస్తుగానే బీఎల్ఓలకు ఫామ్ 12డీ పత్రాలను అం దజేయాల్సి ఉంటుంది. రిటర్నింగ్ ఆఫీసర్ అనుమతించాక దివ్యాంగులు, 80 ఏండ్లు దాటిన వారు ఇంటి వద్దే రహస్య ఓటింగ్ పద్ధతిలో బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకోవచ్చు.
ఈవీఎంలపై అభ్యర్థి ఫొటోలు
ఓటర్లు అభ్యర్థులను సలువుగా గుర్తించేందుకు వీలుగా ఈవీఎంల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల ఫొటోలను ముద్రించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమ వుతుంది. గత ఎన్నికల్లో ఈవీఎంల్లో పార్టీ గుర్తు, అభ్యర్థి పేరు ఉండగా ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థుల ఫొటోలు ముద్రించేందుకు ఎన్నికల కమిషన్ సమాయత్తం అవుతున్నది. ఎన్నికల్లో జరిగే అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల కమిషన్ ‘సీ విజిల్’ యాప్‌ను తీసుకువచ్చింది. సీ విజిల్లో ఫిర్యాదులు అందిన వెంటనే చర్యలు తీసుకునేలా ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

