బొల్లారం, అక్టోబర్ 25: త్వరలో జరగబోయే నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. 20 21 సెప్టెంబర్ నాటికి డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులుగా ఈసీ తెలిపింది. డిగ్రీ పూర్తి చేసినవారు 20 25లో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఇప్పుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని, నవంబర్ 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఇప్పటికే ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే..
ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే షురూ అయ్యింది. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓటు నమోదు కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నాలుగు జిల్లాల పరిధిలో ఉన్న ఆయా నియోజకవర్గాలకు చెందిన అర్హత కలిగిన ఓటర్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు కోసం ఫారం 18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తు పూర్తి చేయాలి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు కోసం ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ముందుగా https://ceotelangana.nic.in/home.html సైట్లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ – టీచర్ ఆప్షన్స్ పై క్లిక్ చేయాలి. వెంటనే కొత్తవిండో ఓపెన్ అవుతుంది. 1. గ్రాడ్యుయేట్స్ 2024, 2. టీచర్స్2024, 3.ఫామ్-18 కనిపిస్తాయి. గ్రాడ్యుయేట్స్ ఐప్లె ఆన్లైన్, డౌన్లోడ్ ఐప్లెయ్ ఫామ్ అనే ఆప్షన్ ఉంది. ఐప్లె ఆన్లైన్ పై క్లిక్ చేయాలి. ఇకడ మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది. ముం దుగా మీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎంచుకోవాలి.
ఆ తర్వాత అడ్రస్, ఆధార్, విద్యార్హతలను ఎంట్రీ చేయాలి. డిగ్రీ సర్టిఫికె ట్, ఫొటోలను అప్లోడ్ చేయాలి. చివరలో మీ మొబైల్ నెంబర్, మెయిల్ అడ్రస్, ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఫైనల్‌గా సబ్మిట్ బటన్ పై నొకితే అప్లికేషన్ ప్రాసె స్ పూర్తి అవుతుంది. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ సాయం తో మీ అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక టీచర్లకు కూడా పైన పేర్కొన్న విధంగానే చేయాల్సి ఉంటుంది. కానీ టీచర్స్ ఫామ్ 19 ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలతోపాటు టీచర్‌గా పని చేసిన ప్రాంతాల వివరాలను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఫొటో కూడా అప్లోడ్ చేయాలి. చివరలో సబ్మి ట్ బటన్‌పై నొకితే ప్రాసెస్ పూర్తి అవుతుంది.
రిజిస్ట్రేషన్ లింక్స్…
https://ceotserms2.telangana.gov.in/mlc/form18.aspx
టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కోసం లింక్…
https://ceotserms2.telangana.gov.in/mlc/form19.aspx గడువులోపు దాఖలైన దరఖాస్తులను పరిశీలించిన తర్వాత నవంబర్ 23న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. ముసాయిదా జాబితా పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే నవంబర్ 23 నుంచి డిసెంబర్ 9 తేదీ వరకు తెలియజేయాలి. పైన పేరొన్న నాలుగు జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రులు ఎమ్మెల్సీ కాలపరిమితి 2025 మార్చి 29 నాటితో ముగియనున్నది.