BRS convenor Anjaneyulu| మెదక్ మున్సిపాలిటీ 15 : ప్రజా సమస్యలపై నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని.. ఫార్ములా ఈ-రేస్ కేసులో ప్రభుత్వం రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ మెదక్ పట్టణ కన్వీనర్ మామిళ్ల అంజనేయులు మండిపడ్డారు.
ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టుతున్నారని విమర్శించారు. పాలన చేతగాని ముఖ్యమంత్రిని ప్రజాక్షేత్రంలోకి వెళ్తే ఎక్కడికక్కడ నిలదీస్తుండటంతో ప్రజల దృష్టిని మరల్చేందుకే డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
దమ్ముంటే రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ టెస్ట్‌కు రావాలని కేటీఆర్ సవాల్ విసిరిన విషయాన్ని అంజనేయులు గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా కేటీఆర్ సవాల్‌ను స్వీకరించి లై డిటెక్టర్ పరీక్షకు హాజరై తన పవిత్రతను చాటుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా కేటీఆర్‌ను ఎదుర్కోలేక రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏసీబీ నోటీసుల పేరుతో ఇబ్బందులు పెట్టాలని చూస్తుందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ వ్యవసాయ పనులకు రైతులకు వెన్నుదన్నుగా నిలిచారని, రైతు బీమా ద్వారా రైతులకు అండగా నిలిస్తే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీమా కంపెనీలకు డబ్బులు చెల్లించకుండా రైతుబీమా పథకాన్ని తొక్కి పెడుతున్నారని మండిపడ్డారు. రైతులు, ప్రజలు, విద్యార్థుల నుంచి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకోవడానికే ఏసీబీ నోటీసుల పేరుతో రేవంత్‌రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపిండన్నారు.
Sim Card | మీ పేరుతో ఎవరైనా సిమ్‌కార్డు తీసుకున్నారా..? ఎలా తెలుసుకోవాలంటే..?
RFCL | కోలుకుంటున్న ఆర్ఎఫ్సీఎల్ బాధితుడు.. అప్రమత్తతతోనే తప్పిన అగ్ని ప్రమాదం
Free medical camp | దయానంద విద్యా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం