మునిపల్లి, జూన్ 17: రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్పై తనకు ఉన్న అభిమానాన్ని పట్టబొట్టు వేయించుకొని చాటుకున్నాడో ఓ యువకుడు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని పెద్దగోపులారం గ్రామానికి చెందిన పట్వారీ మహేందర్ తన ఒంటిపై కేసీఆర్ ఫొటో పచ్చబొట్టు, మెడపై కేటీఆర్ పేరు పచ్చబొట్టు వేయించుకున్నాడు. తనకు చిన్నతనం నుంచే కేసీఆర్ అంటే అభిమానమని మహేందర్ చెబుతుంటాడు.
కేసీఆర్ అంటే ఎందుకు అంత ఇష్టమని ఎవరైనా అడిగితే, అతను ఇచ్చే సమాధానం ఒక్కటే… తనకు కేసీఆర్ దేవుడితో సమానమని చెబుతుంటాడు. కనిపించని దేవుళ్ల కంటే… కనిపించే దేవుడు కేసీఆర్ సార్ నాకు చాలా ఇష్టమంటాడు. ఒక్కసారైనా కేసీఆర్ సార్ను కలవాలన్నదే తన కోరిక అని మహేందర్ చెప్పాడు. కేసీఆర్తో పాటు కేటీఆర్ అంటే కూడా తనకు ఎంతో అభిమానమని మహేందర్ తెలిపారు. మహేందర్ తన మెడపై కేటీఆర్ పేరును సైతం పచ్చబొట్టు వేయించుకున్నారు.