రామాయంపేట, మే 15 : ఇంటిముందు తాళం వేసి ఉన్న గ్లామర్ బైక్ను ఓ దుండకుడు పట్టపగలే తాళం తీసేసి దర్జాగా తీసుకెళ్లిన సంఘటన బుధవారం రామాయంపేట పట్టణంలోని మంజీరా కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..రామాయంపేట పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బాలకృష్ణ కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని ప్రభుత్వ రెసిడెన్సియల్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. పట్టణంలోని అద్దెకు ఉన్న టీచర్ సెలవులు కదా అని బైక్ను బయట పార్క్ చేశాడు.
ఇదే సమయంలో గుర్తు తెలియని దుండగుడు గ్లామర్ బైక్ తాళం ధ్వంసం చేసి బైకును తీసుకెళ్లాడు. ఈ విషయమై బాధితుడు బాలకృష్ణ బుధవారం రాత్రి రామాయంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గురువారం సీసీ కెమెరాల పుటేజీని చూడగా దుండగుడు బైక్ను తీసుకెళ్తున్న దృశ్యం కనిపించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలరాజు తెలిపారు.