రామాయంపేట, డిసెంబర్ 20: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానలను ఆధునీకరించి పూర్వవైభవం తీసుకుస్తామని మెదక్ జిల్లా వైద్యాధికారి చందు నాయక్ పేర్కొన్నారు. మంగళవారం రామాయంపేట సీహెచ్‌సీ, డి.ధర్మారంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు కోసం డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించామని, వారికి పలు సూచనలు చే స్తున్నామని తెలిపారు. ప్ర భుత్వ దవాఖానల్లో సి బ్బందిని త్వరలోనే నియమిస్తామన్నారు.
ప్రస్తుతం కామారెడ్డి, తూప్రాన్ దవాఖానల నుంచి డిప్యుటేషన్‌పై గైనకాలజిస్టును నియమిస్తామన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచుతున్నామన్నారు. అందుకు గ్రామాల్లోని ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు. జిల్లా కేంద్రంలోని దవాఖానలో 57 రకాల రక్త పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ దవాఖానలో ఎక్కడైనా శాంపిల్ ఇచ్చి రిపోర్టును పొందవచ్చని డీఎంహెచ్‌వో తెలిపారు. కార్యక్రమంలో రామాయంపేట సీహెచ్‌సీ వైద్యులు సుకేషిని, డి.ధర్మారం వైద్యులు ఎలిజబెత్‌రాణి, డాక్టర్.ప్రదీప్ ఉన్నారు.