న్యాల్కల్, సెప్టెంబర్ 8 : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని చాల్కి గ్రామ సమీపంలోని చౌట వాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోయి మృతి చెందినట్లు హద్నూర్ ఎస్సై రామానాయుడు తెలిపారు. ఈ నెల 6వ తేదీన మండలంలోని అమీరాబాద్కు చెందిన బేగరి రవీందర్ (36) రాఘవపూర్‌కు చెంది న స్నేహితుడు కిరణ్‌తో కలిసి పెద్దశంకరంపేట్లోని బంధువుల ఫంక్షన్‌కు వెళ్లారు. తిరిగి రాత్రి ఇంటికి వస్తున్న క్రమంలో రాఘవపూర్ వద్ద కిరణ్ దిగిపోయాడు.
మండలంలోని చాల్కి గ్రామ సమీపంలోని ఆర్అండ్బీ రోడ్డుపై నుంచి చౌట వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో వాగు నుంచి రవీందర్ బైక్‌పై వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు వరదలో కొట్టుకుపోయాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. శనివారం సా యంత్రం చౌట వాగు సమీపంలో రవీందర్ మృతదేహం, బైక్ లభించింది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి తండ్రి రామ్‌చందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హద్నూర్ ఎస్సై తెలిపారు.