దుర్గమ్మను పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వన దుర్గాభవానీ మాత సన్నిధి ఆదివారం భక్తులతో కిక్కిరిసింది.
- భక్తులతో కిక్కిరిసిన ఏడుపాయల
- అన్ని ఏర్పాట్లు కల్పించిన ఆలయ కమిటీ
పాపన్నపేట, జనవరి 22: మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వన దుర్గాభవానీ మాత సన్నిధి ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఏడుపాయలకు చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏడుపాయల ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈవో సార శ్రీనివాస్, సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి, రవివీర్కుమార్, తోట నరసింహులు, యాదాగౌడ్, బత్తిని రాజు, వరుణాచారి, మహేశ్ తదితరులు ఏర్పాట్లు చేశారు. వేద పండితులు శంకరశర్మ, పార్థివశర్మ, రాముశర్మ, రాజశేఖర్‌శర్మ, మురళీశర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఏడుపాయల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా పాపన్నపేట ఎస్సై విజయ్‌కుమార్ బందోబస్తు చర్యలు చేపట్టారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

