జహీరాబాద్, అక్టోబర్ 18: జహీరాబాద్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని రాష్ర్ట ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఝరాసంగం కాంగ్రెస్ జడ్పీటీసీ వినీలా నరేశ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జహీరాబాద్‌లో ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్‌రావును గెలిపించుకుందామని, అభివృద్ధి కొనసాగిద్దామన్నారు. అన్ని వర్గాలకు మేలు చేసే మ్యానిఫెస్టో విడుదల చేసిందన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చూసి ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అయిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి తెలంగాణలో నెలకున్నదన్నారు. వారితో బీఆర్ఎస్ ఝరాసంగం మండల అధ్యక్షుడు వెంకటేశం, నాయకులు నామ రవికిరణ్, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాణిక్‌రావు గెలుపు కోసం కృషి చేస్తాం
జహీరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్‌రావు గెలుపు కోసం కృషి చేస్తామని జడ్పీటీసీ వినీలా నరేశ్ తెలిపారు. బుధవారం జహీరాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ స్థానికేతరులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి స్థానికులను మోసం చేసిందన్నారు. ఎస్సీ రిజర్వేషన్ ఉన్న స్థానికులకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి స్థానికుడు కావడంతో ప్రతిఒకరూ ఆశీర్వదించాలన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎన్నికల ఇన్చార్జి దేవీప్రసాద్‌రావు, టీఎస్ఐడీసీ చైర్మన్ తన్వీర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి తదితరులు ఉన్నారు.