మెదక్ : మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రానికి చెందిన చిమ్మ గల్లీలో నివసిస్తున్న చిమ్మ సత్తెమ్మ ఇల్లు బుధవారం దగ్ధమైంది. దీంతో దాదాపు లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు తెలిపారు.
అకస్మాత్తుగా ఉదయం 8 గంటల సమయంలో మంటలు చెరగడంతో ఇంటిలో ఉన్న సామగ్రి మొత్తం అగ్నికి ఆహుతి అయిందని వారు పేర్కొన్నారు. ఈ సమయంలో తల్లీ కుమారుడు బయట ఉండడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఇంట్లో ఉన్న టీవీ బట్టలు కుర్చీలు అలమార .. రేకులు.. ఇతర సామాగ్రి మొత్తం కాలిపోయాయని వివరించారు.. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.