HomeMedakA Decision Has Been Taken To Increase The Retirement Age Of Anganwadis To 65 Years
అంగన్వాడీలకు తీపికబురు
ప్రభుత్వం అంగన్వాడీలకు తీపికబురు చెప్పింది. అంగన్వాడీలు, మినీ అంగన్వాడీలు, ఆయాల ఉద్యోగ విరమణ వయస్సను 65 ఏండ్లకు పెంచేందుకు సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు.
ఉద్యోగ విరమణ వయస్సును 65 ఏండ్లకు పెంచిన ప్రభుత్వం
ఉద్యోగ విరమణ సమయంలో టీచర్లకు రూ.లక్ష, ఆయాలకు రూ.50 వేల ఆర్థికసాయం
మినీ అంగన్వాడీల అప్‌గ్రేడ్‌కు నిర్ణయం
విరమణ తర్వాత ఆసరా పింఛన్లకు సర్కార్ ఆమోదం
ఇప్పటికే మూడుసార్లు వేతనాలు పెంపు
సంగారెడ్డి జిల్లాలో 1504 అంగన్వాడీలు, 2848 మంది సిబ్బంది
మెదక్ జిల్లాలో 1076 కేంద్రాలు, 1684 మంది ఉద్యోగులు
అంగన్వాడీలను బలోపేతం చేయడంతో పాటు టీచర్లు, మినీ టీచర్లు, ఆయాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. తెలంగాణ ఏర్పాటు తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులకు సీఎం కేసీఆర్ మూడు సార్లు వేతనాలు పెంచారు. తాజాగా అంగన్వాడీల ఉద్యోగ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ విరమణ సమయంలో టీచర్లకు రూ. లక్ష, మినీ టీచర్లు, ఆయాలకు రూ.50వేలు ఆర్థిక సాయాన్ని అందించడంతో పాటు రిటైర్మెంట్ అనంతరం ఆసరా పింఛన్లు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇప్పటివరకు మినీలుగా కొనసాగుతున్న సెంటర్లను ప్రధాన కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ముఖ్యమంత్రి ప్రకటనతో ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– మెదక్ (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి, ఆగస్టు 26
మెదక్, నమస్తే తెలంగాణ/ సంగారెడ్డి, ఆగస్టు 26: ప్రభుత్వం అంగన్వాడీలకు తీపికబురు చెప్పింది. అంగన్వాడీలు, మినీ అంగన్వాడీలు, ఆయాల ఉద్యోగ విరమణ వయస్సను 65 ఏండ్లకు పెంచేందుకు సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. దీంతో జిల్లాలోని 5 ప్రాజెక్టులు నారాయణఖేడ్, జోగిపేట్, సదాశివపేట, పటాన్చెరు, జహీరాబాద్ పరిధిలో1504 అంగన్వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్లు, మినీ టీచర్లు, ఆయాలు 2,848మందికి లబ్ధి చేకూరనున్నది. ఉద్యోగ విరమణ సమయం లో ప్రభుత్వం ఆర్థికసాయాన్ని టీచర్లకు రూ.లక్ష, మినీ టీచర్లు, ఆయాలకు రూ.50వేలు అందిస్తామని ప్రకటించారు. వీటితోపాటు ఇప్పటివరకు మినీ అంగన్వాడీలుగా కొనసాగుతున్న 160 మినీలను మెయిన్ అంగన్వాడీలుగా అప్‌గ్రేడ్ చేస్తామని ప్రకటించారు. ఉద్యోగ విరమణ పొం దిన అనంతరం అంగన్వాడీల్లో విధులు నిర్వహించిన టీచర్లు, ఆయాలకు ఆసరా పింఛన్లు అం దించేందుకు ముఖ్యమంత్రి ప్రకటించి భరోసానింపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అంగన్వాడీల వేతనాలు మూడుసార్లు పెంచి గౌరవించిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అందించే పాలు, గుడ్డు, పౌష్టికాహారంతోపాటు మందులు అందిస్తూ అలనాపాలనా చూసుకుంటున్నారు. ఇందుకు సం బంధించిన ఫైల్‌పై నేడో,రేపో సీఎం సంతకం చేసి అమలు చేసే ప్రక్రయను ప్రారంభించనున్నారు. దీంతో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సంతోషంలో మునిగిపోయారు.
మెదక్ జిల్లాలో…..
మెదక్ జిల్లాలో 1076 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, 885 మెయిన్ కేంద్రాలు, 191 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నా యి. ఇందులో మెయిన్ అంగన్వాడీ కేంద్రంలో 862 మంది టీచర్లు, 822 ఆయాలు పనిచేస్తున్నారు. అలాగే 189 మినీ అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.
అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ..
దేశంలో ఎకడా లేనివిధంగా అంగన్వాడీ టీచర్లకు అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్. అంగన్వాడీల సమస్యలపై తక్షణమే స్పందించి వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు 65 ఏండ్ల తర్వాత ఉద్యోగ విమరణ పొందిన వెంటనే ఆసరా పింఛన్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతినెలా వారికి పింఛను అందేలా చర్యలు తీసుకుంటుంది. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించలేదు. అంగన్వాడీ కేంద్రాల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న పాపానపోలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అంగన్వాడీల సేవలను గుర్తించింది. అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను పెంచింది. కేంద్రం లో మోదీ సర్కార్ అధికారంలోకి రాకముందు అంగన్వాడీ వేతనాల్లో కేంద్రం వాటా 90శాతం, రాష్ట్ర ప్రభుత్వం వాటా 10శాతం ఉండేది. అయితే కేంద్రం ఈ వాటాను 60-40 శాతానికి తగ్గించింది. అయితే టీచర్ల వేతనాల్లో 19శాతం, ఆయాల వేతనాల్లో 17శాతం మాత్రమే కేంద్రం ఇస్తుంది. మిగతాది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.
మినీ అంగన్వాడీల అప్‌గ్రేడేషన్ సంతోషం
ప్రభుత్వం మినీ అం గన్వాడీలను అప్‌గ్రే డేషన్ చేయడం హర్ష ణీయం. కొన్నేండ్లుగా అంగన్వాడీల సమ స్యల పరిష్కారానికి ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కా లేదు. గతంలో జరిగిన చర్చలో ఉద్యోగ విరమణ సమయంలో టీచర్లకు రూ.10 లక్షలు, ఆయాలకు రూ.5 లక్షలు అడిగాం. కానీ ప్ర భుత్వం అంగన్వాడీల ఉద్యోగ విరమణ వయస్సును 65 ఏండ్లకు పెంచాం.. విరమణ సమయంలో టీచర్లకు రూ.లక్ష, ఆయాలకు రూ.50వేలు ప్రకటించింది. తాము కోరిన దానిని సీఎం కేసీఆర్ సార్ పునరాలోచన చేసి న్యాయం చేయాలి.
– పటేల్మంగా, సంగారెడ్డి జిల్లా అంగన్వాడీల సంఘం అధ్యక్షురాలు