అల్లాదుర్గం, ఫిబ్రవరి 19: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన ఘటన అల్లాదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని 161వ జాతీయ రహదారిపై గడిపెద్దాపూర్ వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన గడ్డం ప్రభాకర్(28), గడ్డం భూమయ్య(30), అల్లాదుర్గం శ్రీకాంత్ (24) మాసయ్య నలుగురు కలిసి ద్విచక్రవాహనంపై రాంగ్రూట్లో వెళ్తున్నారు.
గడిపెద్దాపూర్ వద్ద ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీ కొట్టడంతో ప్రభాకర్, భీమయ్య, శ్రీకాంత్ అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన మాసయ్యను 108లో జోగిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్‌రెడ్డి తెలిపారు.