సిద్దిపేట అర్బన్, మే 13 : సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి 77.8 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో 76.93, సిద్దిపేట నియోజకవర్గంలో 73.15, దుబ్బాక నియోజకవర్గంలో 81.72, గజ్వేల్ నియోజకవర్గంలో 79.7 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. తుది పోలింగ్ శాతంలో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ ఓటింగ్ శాతం స్వల్ప తేడా ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి మను చౌదరి మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా ముగిసిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొని ఓటు వేసినందుకు ఓటర్లకు, సిబ్బందికి, సహకరించిన ప్రతి ఒక్కరికీ కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.