కార్యదర్శులు బాధ్యతగా పనిచేయాలి
పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పని చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. శుక్రవారం కలేక్టరేట్ ఆడిటోరియంలో పంచాయతీ శాఖ అధికారులు, మండల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
- ఈనెల 18 లోగా 50 శాతం లేబర్ మొబిలైజేషన్ కావాలి
- సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 10: పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పని చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. శుక్రవారం కలేక్టరేట్ ఆడిటోరియంలో పంచాయతీ శాఖ అధికారులు, మండల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామంలో యాక్టీవ్ లేబర్‌లో 50 శాతం లేబర్ మొబిలైజేషన్ చేయాలని స్పష్టం చేశారు. ఎన్ఎంఎంఎస్ యాప్‌లో మొబైల్ ద్వారా లేబర్ ఫొటోలతో హాజరు నమోదు చేయాలన్నారు.
కూలీలు చేసిన పనికి సంబంధించి వాటిని ప్రాపర్‌గా రికార్డు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో వారి పే ఆర్డర్స్ జనరేట్ చేయాలని, ఈజీఎస్ కింద ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 20 పనులు శల్ఫ్లో ఉండాలన్నారు. లేబర్ పని చేయగలిగిన పనులు గుర్తించాలన్నారు. శ్రమ శక్తి సంఘాలతో చర్చించి, టెక్నికల్ అసిస్టెంట్‌తో అంచనా చేయించి, ప్రతిపాదనలు పంపితే మంజూరు ఇస్తారన్నారు. పంచాయతీకి ఆదాయ వనరుగా ట్యాంకర్, ట్రాలీ మారాలన్నారు. ప్రతి శుక్రవారం మొక్కలకు నీరు పట్టాలని ఆదేశించారు. ప్రతి పంచాయతీలో వారంలో కనీసం 10 ట్యాంకర్లు వినియోగించాలని, అందుకు సంబంధించిన నివేదికను డీఆర్డీవోకు అందించాలని సూచించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్, డీఆర్డీడీవో శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, అదనపు పీడీలు, డీఎల్పీవోలు, నారాయణఖేడ్, పటాన్చెరు నియోజకవర్గాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

