చిన్నకోడూరు, నవంబర్ 8 : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్ గ్రామానికి చెందిన మీసం మల్లయ్య తన వ్యవసాయ పొలం వద్ద పశువుల పాకలో గురువారం గొర్రెల మందను తొలి ఇంటికి వచ్చాడు. శుక్రవారం ఉదయం గొర్రెల మంద దగ్గరికి వెళ్లి చూడగా 42 గొర్రెలు హైనా దాడిలో మృత్యువాత పడ్డాయి.
దీంతో రూ.2 లక్షల మీరు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు మీసం మల్లయ్య వాపోయాడు. చిన్నకోడూరు మాజీ ఎంపీపీ కూర మాణిక్య రెడ్డి సంఘటనా స్థలం వద్దకు చేరుకుని బాధితుడిని పరామర్శించారు. బాధితుడికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అదేలా కృషిచేస్తామన్నారు. ఆయన వెంట ఫారెస్ట్ అధికారులు బుచ్చయ్య, శ్రీకాంత్, మాజీ సర్పంచ్ గాజుల బాబు, బీఆర్ఎస్ నాయకులు ఎలేటి రాజారెడ్డి, సుంచు ఎల్లయ్య, ఉప సర్పంచ్ పున్నం సురేశ్, గుర్రాల రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.