త్వరలో 2600 వైద్యుల పోస్టులకు నోటిఫికేషన్
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కాన్పులు పెరగాలి
ఉచితంగా కంటి, మోకాలు ఆపరేషన్లు
ఈ నెల 12 గౌరవెల్లి ట్రయల్ రన్
రామవరం పీహెచ్సీ ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్‌రావు
అక్కన్నపేట, జూన్ 7: ప్రజారోగ్యం, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం అక్కన్నపేట మండలం రామవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ప్రభుత్వ ద వాఖానల్లో సాధారణ కాన్పులు పెరగాల్సి అవసరం ఎంతైనా ఉందన్నారు. క్షేత్రస్థాయిలో ఆశ, ఏఎన్ఎం, హెల్ సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో పైసా ఖర్చు లేకుండా ఉచితంగా కంటి, మోకాలు ఆపరేషన్లు ప్రారంభించామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రైవేటు దవాఖానల్లో పెద్ద ఆపరేషన్ల చేయకుండా నిలువరిస్తున్నామన్నారు. ఆపరేషన్లతో కలిగే ఇబ్బందులును క్లుప్తంగా వివరించారు. ఆశలు, ఏఎన్ఎంలు, ఫార్మసిస్టుతో మాట్లాడారు.
వైద్యారోగ్యశాఖ రిపోర్ట్‌ను అడిగి తెలుసుకున్నారు. పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రుపాలు పట్టించేలా చూడాలన్నారు. నార్మల్ డెలివరీ చేయిస్తే ఆశ, ఏఎన్ఎం, స్టాఫ్ నర్స్, డాక్టర్‌కు రూ.3వేల నగదును ప్రోత్సాహకంగా అందించనున్నట్లు ప్రకటించారు. త్వరలో 2600 వైద్యుల పోస్ట్‌ల భర్తీ కో సం నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు చె ప్పారు. పనితీరు బాగున్న వైద్యారోగ్య సిబ్బంది ని శాలువాలతో సన్మానించారు. అక్కన్నపేట, రామవరం పీహెచ్‌సీకి ప్రహరీ మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. రామవరం- తోర్నాల రోడ్డుకు ప్రతిపాదనలు పంపిస్తే నిధులు మంజూరు చేస్తానన్నారు. ఈ నెల 12న గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్లో భాగంగా ప్రాజెక్టులో నీళ్లు పో యిస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, డీఎంఅండ్ హెచ్‌వో డాక్టర్ కాశీనాథ్, ఎంపీపీ మాలోతు లక్ష్మీబీలూనాయక్, జడ్పీటీసీ భూక్య మంగ, సర్పంచ్ వనపర్తి స్వప్నానరేశ్, ఎంపీటీసీ లింగాల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసర్ల అశోక్‌బాబు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెసరు సాంబరాజు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.