ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసే ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్ పిలుపునిచ్చారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ఆయన తనయుడు కొత్త పృథ్వీరెడ్డితో కలిసి శనివారం రాయపోల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫరూఖ్హుస్సేన్ మాట్లాడుతూ.. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో చేయలేని అభివృద్ధిని కేవలం తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతులకు 24గంటల విద్యుత్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మూడు గంటల విద్యుత్ చాలన్న కాంగ్రెస్ కావాలా.. 24గంటలు కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ కావాలా ప్రజలు ఆలోచన చేయాలన్నారు. కాంగ్రెస్ నాయకులు సీఎం కుర్చీకోసం పాకులాడటం తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.

రాయపోల్, నవంబర్ 11: కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే భవిష్యత్ అంధకారమవుతుందని, ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసే ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్ అన్నారు. బీజేపీ,కాంగ్రెస్‌పాలిత రాష్ర్టాల్లో రైతులకు 24 గంటల విద్యుత్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ఆయన తనయుడు కొత్త పృథ్వీరెడ్డితో కలిసి శనివారం రాయపోల్ మండలంలోని ఎల్కల్, బేగంపేట, వీరానగర్, అంకిరెడ్డిపల్లి, వడ్డేపల్లి, దోడ్లపల్లి, విరారెడ్డిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ గ్రామాన ప్రజలు మంగళహారతులు, బతుకమ్మ, బోనాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్ మాట్లాడుతూ 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో చేయలేని అభవృద్ధి కేవలం తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. దేశంలోనే రాష్ర్టాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న 24 గంటల విద్యుత్‌తో పాటు వివిధ సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు సీఎం కుర్చీకోసం పాకులాడుతున్నారని, పదవుల కోసం కొట్లాడడం తప్ప ప్రజల కష్టసుఖాలు పట్టించుకోరని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాంలకు నీలయమన్నారు. మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారా..24గంటల పాటు కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్కు వేస్తారా ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. గత ఉప ఎన్నికల్లో ప్రజను మోసం చేసి వాగ్దానాలను విస్మరించిన ఎమ్మెల్యే రఘనందన్‌రావుకు మళ్లీ ఓటు వేస్తే భవిష్యత్ అంధకారమేనన్నారు. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పచ్చి బ్రోకర్ అని, టికెట్ల కోసం కొట్లాడుతూ ఆపార్టీ నాయకులు ఛీకొడుతున్నా సిగ్గులేకుండా సీఎం కేసీఆర్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవ చేశారు. రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న బీఆఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. మనవత్వం కలిగిన వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు.గతంలో టీడీపీలో ఉన్న చెరుకు ముత్యంరెడ్డి అనారోగ్యానికి గురైతే విషయం తెలుసుకుని విదేశాల్లో మెరుగైన వైద్యం చేయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. నాడు సీఎం కేసీఆర్ ఎంతో గొప్ప వ్యక్తి అన్న చెరుకు శ్రీనివాస్‌రెడ్డి నేడు విమర్శించడం సిగ్గుచేటన్నారు. మెదక్ ఎంపీపై కత్తిపోట్లను ఖండించాల్సిందిపోయి అసత్య ప్రచారాలు చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు నీతిలేదన్నారు.

మీ ఆశీర్వాదంతో మెదక్ ఎంపీగా కొత్త ప్రభాకర్‌రెడ్డి పదేండ్లు గెలిచి సేవ చేశాడని, దుబ్బాక ఎమ్మెల్యేగా మళ్లీ ఆశీర్వదించి గెలిపిస్తే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సహకారంతో మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తనయుడు పృథ్వీరెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మొద్దన్నారు కారుగుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ కావడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారానికి అపూర్వ స్పందన లభించింది. సర్సంచ్‌లు శ్యామాలకుమార్,ప్రవీణ్,వెంకటనర్సింహారెడ్డి, చంద్రశేఖర్, ఎంపీటీసీ పిట్ల వెంకటయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరశర్మ, జడ్పీటీసీలు యాదగిరి, అర్జున్‌గౌడ్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మర్ శ్రీనవాస్, మండల కోఆప్షన్ సభ్యుడు పర్వేజ్, రాష్ట్ర యువజన నేతలు రాజిరెడ్డి, దయాకర్, పాల్గొన్నారు.