జహీరాబాద్, అక్టోబర్ 20: యాసంగిలో రైతులు నా ణ్యమైన విత్తనాలు వేసి అధిక దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం కొత్త రకం శనగ విత్తనాలు పంపిణీ చేస్తున్నదని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మాల్కాపురం శివకుమార్ తెలిపారు. గురువారం జహీరాబాద్ పట్టణంలో ఉన్న డీసీఎంఎస్ ఎరువులు, విత్తనాల అమ్మకల కేంద్రం వద్ద శనగల అమ్మకాల కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడా రు. రైతులు యాసంగిలో అధికలో దిగుబడులు సాధించేందుకు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్ర్తవేత్తలు ఈ ఏడాది కొత్త రకం శనగ విత్తనాలు మార్కెట్లో విడుదల చేశారన్నారు. 25 కిల్లోల శనగ విత్తనాల బస్తాకు రూ. 1747 ధర నిర్ణయించినట్లు తెలిపారు. అవసరమైన రైతులు శనగ విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. శనగ విత్తనలు డీసీఎంఎస్ కేంద్రాలు, సహకార సంఘాల్లో అమ్మకాలు చేసేందు కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
22న వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
వానకాలంలో రైతులు పండించిన వడ్లు కొనుగోలు చేసేందుకు ఉమ్మడి మెదక్ జిల్లాలో 710 కేంద్రాలు, సంగారెడ్డి జిల్లాలో 155 కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేస్తున్నామన్నారు. వడ్లు కొనుగోలు చేసేందుకు ప్రభు త్వం డీసీఎంఎస్, ఐకేపీ, సహకార సంఘాల ద్వారా ఏర్పాట్లు చేసిందన్నారు. గతే డాది ప్రభుత్వం 1.80లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేసిందని, ఈ ఏడాది వరిసాగు పెరిగిపోవడంతో 2.62 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకుందన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయనికి సాగు నీరు అందించేందుకు ఏర్పాటు చేసిన కాళేశ్వరం, సింగూ ర్ ప్రాజెక్టు నీటితో వరి సాగు పెరిగిందన్నారు.
రైతులు పండించిన వడ్లకు మద్దతు ధర కలిపించేందుకు సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. వడ్లు అమ్మకాలు చేసిన రైతులకు 72 గంట ల్లో వారి బ్యాంకు ఖాతాలో నగదు జామ చేస్తారన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి సమస్యలు రాకుం డ రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయం చేస్తారన్నారు. సమావేశంలో జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీఏ భిక్షపతి, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కిషన్‌పవార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండప్ప, విజయ్‌కుమార్, రాములునేత, గడ్డం జనార్దన్, సుభాశ్, నవీన్‌కుమార్, ఏఈవో ప్రదీప్‌కుమార్ తో పాటు పలువురు ఉన్నారు.