అభయహస్తం ఆన్లైన్ పూర్తి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28 నుంచి ఈ నెల 6 వరకు అభయహస్తం దరఖాస్తులు స్వీకరించింది. ఈ దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ బుధవారంతో పూర్తయ్యింది.
- మెదక్ జిల్లాలో 2,25,680 దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు
- ఇక మిగిలింది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ
మెదక్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28 నుంచి ఈ నెల 6 వరకు అభయహస్తం దరఖాస్తులు స్వీకరించింది. ఈ దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ బుధవారంతో పూర్తయ్యింది. మెదక్ జిల్లావ్యాప్తంగా 469 పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించి 2,25,680 దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశారు.
వీటిలో మహాలక్ష్మి పథకం కింద 1,87,883 దరఖాస్తులు, రూ.500 వంట గ్యాస్‌కు 1,95,377 దరఖాస్తులు, ఎకరాకు రూ.15000 పెట్టుబడి సాయం కోసం 1,45,777, కౌలు రైతుల నుంచి 6579, ఇందిరమ్మ ఇండ్లకు 1,93,169, ఇంటి స్థలం కోసం తెలంగాణ ఉద్యమకారుల నుంచి 2226, 250 గజాల స్థలానికి 405, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు 1,74,016, దివ్యాంగుల పింఛన్లు 4685, ఇతర పింఛన్లకు 46,960
దరఖాస్తులు వచ్చాయి.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

