సోమవారం 30 నవంబర్ 2020
Medak - Oct 22, 2020 , 00:36:54

పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ వరం

 పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ వరం

పెద్దశంకరంపేట : ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం నారాయణఖేడ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని ఆయా గ్రామాలను చెం దిన పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు. పెద్దశంకరంపేట పట్టణానికి చెందిన ఎండి కరీం రూ.15 వేలు, సంగమేశ్వర్‌కు రూ.60 వేలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌లో మంజూరయ్యాయి. కార్యక్రమంలో రైతుబంధు సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి, ఎంపీపీ జంగం శ్రీనివాస్‌, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కుంట్ల రాములు, ముదిరాజ్‌ సంఘం మండల అధ్యక్షుడు పున్నయ్య ఉన్నారు.