శనివారం 31 అక్టోబర్ 2020
Medak - Jul 14, 2020 , 03:39:22

మంజీరాలోకి వరద

మంజీరాలోకి వరద

 మంజీరా ఏరియాలో నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షానికి కొత్తనీరు వచ్చి చేరుతున్నది. వరద చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నదిలో నీరు లేక ఎడారిని తలపించిన మంజీరా, వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి  వరద చేరుతుంది. మంజీరా నది, మండలంలోని జన్‌వాడలో ప్రవేశించి దాదాపు 40కిలో మీటర్ల దూరం రాయిపల్లి వద్ద ముగిస్తుంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మంజీరా 96 కిలో మీటర్లు ప్రవహిస్తుంది.            -నాగల్‌గిద్ద/ మనూరు