గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Jun 17, 2020 , 23:43:14

పల్లె ప్రగతితో గ్రామాల్లో మార్పు

పల్లె ప్రగతితో గ్రామాల్లో మార్పు

మెదక్‌ : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిని విజయవంతం చేయడంలో ఎంపీడీవోల పాత్ర కీలకమైందని, వారి పనితీరులో మార్పు రావాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో జిల్లాలోని ఎంపీడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాల్లో ఎంతో మార్పు వచ్చిందని కలెక్టర్‌ అన్నారు. దీనిలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వడం, చుట్టూ పక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం జరుగుతున్నదని, ఇది ఎంతో మంచి పరిణామమని కలెక్టర్‌ అభిప్రాయపడ్డారు. దీనిలో సర్పంచులు, సెక్రటరీల పాత్ర ఎంతో ఉందన్నారు. రాబోయే వర్షాకాలంలో కూడా గ్రామాలు, తండాల్లో ఇదే స్ఫూర్తితో పనులు చేయాలని అన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామాల్లోని ఆయా నర్సరీలో పెంచిన మొక్కలు నాటాలని వాటికి ఇనుప ట్రీ గార్డులు ఏర్పాటు చేయాల్సిందిగా ఎంపీడీవోలకు కలెక్టర్‌ ధర్మారెడ్డి సూచించారు. జిల్లాలో చాలా గ్రామాల్లో సెగిగ్రేషన్‌ షెడ్లను ఇప్పటికే పూర్తి చేశారని, ఇంకా ఏమైనా మిగిలి ఉం టే వాటిని ఈ నెలాఖరు వ రకు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఉ పాధి హామీ పథకంపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ఎన్ని చెరువులు, ఫీడర్‌ చానళ్లు, తూములు, వాటర్‌ ట్యాంకులు ఉన్నాయో వెంటనే వివరాలు సేకరించాలని సూచించారు. దీనికి ఇరిగేషన్‌, డీఆర్‌డీఏ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాల్సి ఉం టుందని కలెక్టర్‌ వివరించారు. ఈ సమావేశంలో డీఆర్‌డీవో శ్రీనివాస్‌, నీటి పారుదల శాఖ ఈఈ ఏసయ్య, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.logo