కొమురవెల్లి, ఏప్రిల్ 29 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని మల్లన్న ఆలయ సమీపంలో ఉన్న గౌరాయపల్లిలో 17వ శతాబ్దానికి చెందిన పులివేట వీరగల్లులు బయటపడ్డాయి. మంగళవారం కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ బృందం గౌరాయపల్లిలో వీరగల్లులను పరిశీలించారు. బృందానికి చెందిన హరగోపాల్ మాట్లాడుతూ.. కన్నడ భాషలో హుళిబేటె అని పిలిచే ఈ పులివేట వీరగల్లులు తెలంగాణలో మూటకోడూరు, నిజామాబాద్, గోనెపల్లి, అమ్మనబోలు వంటి పలుచోట్ల లభించాయన్నారు.
వీరుడు గ్రామం మీద దాడి చేసిన పెద్దపులితో పోరాడి ప్రజలను కాపాడి అమరులైన సందర్భంగా వారిని స్మరిస్తూ ఏర్పాటు వేసిన వీరశిలలు ఇవి అన్నారు. గౌరాయపల్లిలో గుర్తించబడిన వీరగల్లులు మూడు శిల్పాలలో రెం డు పులితో వేటాడుతున్నవి కాగా, మొదటి శిల్పంలో వీరునిత వెనక జడకట్టు ఉందన్నా రు. అతడి చెవులకు కుండలాలు ఉన్నాయన్నారు.
ఈ మీసాల వీరుడు పులిని రెండు చేతులా పట్టుకొని పోరాడుతున్నాడు. మరొ క వీరుడు ఎడమచేతిని మడిచి పులినోట్ల కు క్కి ఎడమకాలితో పులికాళ్లను అడ్డుకుంటూ కుడిచేతితో కత్తితో డాడి చేస్తున్నాడని, నడినెత్తిన సిగుందన్నారు. దీనిని బట్టి ఈ వీరగల్లులు 17,28 శతబ్దాల నాటివని పేర్కొన్నారు. అక్కడే ఉన్న ముడో వీరగల్లు ప్రత్యేకమైనదని, దీన్ని కన్నడంలో సిడితల పిలువబడే గడతల వీరగల్లు శైవభక్తుడు,తన సిగముడిని వంచిన వెదురుగడ కోసకు కట్టుకొని అంజలి పట్టి యోగాసనంలో కూర్చున్నడని పేర్కొన్నారు.
పక్కన కత్తి చేతబట్టి అతిని మెడ నరకబోతున్న వ్యక్తి కనబడుతున్నట్లు తెలిపారు. పై అంతస్తులో దైవసాన్ని ధ్యాన్ని పొందిన వీరుడు కనిపిస్తున్నడన్నారు. ఈ శైలిని బట్టి రాష్ట్రకూటుల కాలం నాటిదన్నా . తెలంగాణలో గడతల వీరగల్లులు పదుల సంఖ్యలో లభించాయని, రాయలసీమ కడప మ్యూజియంలో ఇలాంటి వీరగల్లులు ఉన్నాయని హరగోపాల్ తెలిపారు.