మనోహరాబాద్, మే 29 : అభివృద్ధి పనుల్లో జెట్‌స్పీడ్ వేగంతో మనోహరాబాద్ మండలం దూసుకెళ్తున్న ది. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో ఉన్న మనోహరాబాద్ మండలంలో కోట్లాది నిధులతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తూప్రాన్ మండలంలో ఉన్న మనోహరాబాద్‌లో పనులు జరుగాలంటే అప్పటి ఎమ్మెల్యేలు, ఎంపీల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. కాగా సీఎం కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మనోహరాబాద్ మండలానికి మహర్దశ కలిగింది. సమీకృత ప్రభుత్వ కార్యాలయాల భవనం కోసం సీఎం కేసీఆర్ రూ. 10కోట్లను మంజూరు చేశారు. కొత్త మండలం ఏర్పడిన అనతి కాలంలోనే మెదక్ జిల్లాలోనే వేగంగా అభివృద్ధి చెందిన మండలంగా మనోహరాబాద్ నిలిచింది.
రూ. 10 కోట్లతో సమీకృత భవన నిర్మాణం
నూతనంగా ఏర్పాటైన మనోహరాబాద్ మండలంలో సమీకృత ప్రభుత్వ కా ర్యాలయ భవనాలను నిర్మించేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అన్ని కార్యాలయాలు ఒకే చోట అందరికీ అందుబాటులో ఉండే విధంగా సమీకృత ప్రభుత్వ కార్యాలయ భవనాన్ని నిర్మించేందుకు మనోహరాబాద్ మండలానికి రూ. 5కోట్ల నిధులను మంజూరు చేయగా, మనోహరాబాద్ పట్టణ కేంద్రం అభివృద్ధికి మరో రూ. 5కోట్లను మంజూరు చేశారు. వీటికి ఈ నెల 15న మంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేశారు.
ఆహ్లాదకరంగా హరితహారం మొక్కలు..
రాష్ట్రంలో అటవీశాతాన్ని పెంచడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హ రితహారం కార్యక్రమం ఎన్నో విధాలుగా సత్ఫలితానిచ్చింది. సర్పంచులు, ప్రజాప్రతినిధులు హరితహారం మొక్కలను కంటికి రెప్ప లా కాపాడుతుండటంతో మొ దటి విడుతలో నాటిన హరితహారం మొక్కలు మండుటెండ ల్లో సైతం పూలు విరబూసి చల్ల ని నీడతో.. స్వచ్ఛమైన గాలితో.. రోడ్డు వెంబడి వాహనదారులకు కనువిందు చేస్తున్నాయి.
నాలుగు గ్రామాల్లో 177 ఇండ్లు..
మనోహరాబాద్ మండలానికి మొదటి విడతగా 177ఇండ్లు మంజూరయ్యాయి. రామాయిపల్లి, పాలాట గ్రామాలకు కలిపి 80ఇండ్లు, మనోహరాబాద్‌లో 72ఇండ్లు, కొనాయిపల్లి పీటీలో 25ఇండ్లు మంజూరవ్వగా, వీటి నిర్మాణాలను ఒక్కో ఇంటికి రూ.5.04లక్షల వ్యయాన్ని ఖర్చు చేసి అన్ని వసతులు కల్పించారు. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నల్లా కనెక్షన్, వాటర్ ట్యాంకులు, స్విచ్‌బోర్డులు, తలుపులు వంటి పను ల్లో ఎక్క డా కూడా రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ఇవి కూడా రోడ్డుకు అతి చేరువలో ఉండే విధంగా స్థల సేకరణ చేసి నిర్మాణాలు చేపట్టారు. రామాయిపల్లిలో జాతీయ రహదారికి అనుకొని జీ ప్లస్ 2పద్ధతిలో ఇండ్ల నిర్మాణాన్ని జరిపారు. ఈ నెల 27 న మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా కొనాయిపల్లి పీటీ, రామాయిపల్లి, పాలాట లబ్ధిదారులకు డబుల్‌బెడ్ రూం ఇండ్లను అందజేశారు. రామాయిపల్లిలో మరో 7, కోనాయిపల్లిలో 8నూతన డబుల్‌బెడ్ రూం ఇండ్లను నిర్మించి మిగిలిన లబ్ధిదారులకు అందజేయాలని కలెక్టర్ హరీశ్‌ను ఆదేశించారు.
గ్రామాల్లో వందశాతం అభివృద్ధి పనులు పూర్తి..
మనోహరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో వందశాతం అభివృద్ధి పనులు పూర్తి దశకు చేరుకున్నా యి. ప్రతి గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, పల్లెప్రకృతి వనం, నర్సరీలు పూర్తి కాగా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. రెండు రైతువేదికలు, ధాన్యం నిల్వకోసం గోదాములు నిర్మించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌తో పాటు స్వచ్ఛమైన నీరు అందుతున్నది. అదే విధంగా పాత పంచాయతీ భవనాలను కూల్చివేసి వాటి స్థానంలో నూతన పంచాయతీ, మహిళాసమాఖ్య, యూత్ బిల్డింగ్ పనులు నిర్మాణ దశలో ఉన్నాయి.
ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు.. బస్సు సౌకర్యం
మనోహరాబాద్ మండలంలోని ప్రతి గ్రామానికి రెండు వరుసల బీటీ రోడ్లను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. ఇది వరకు కంకరతేలి అస్తవ్యస్తంగా ఉన్న సింగిల్‌లైన్ రోడ్లును వెడల్పు చేయ డం కోసం సీఎం కేసీఆర్ నిధులను మంజూరు చేశారు. దీంతో మారుమూల గ్రామానికి సైతం డబుల్‌లైన్ బీటీ రోడ్లను నిర్మించారు. దీంతో రవాణా వ్యవస్థ మెరుగుపడిం ది. మెదక్ జడ్పీ చైర్పర్సన్ ర్యా కల హేమలతాశేఖర్‌గౌడ్ మండలంలోని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీ సీ ఎండీ సజ్జనార్ కోరడంతో స్పందించిన ఆయ న మండలంలోని 17 గ్రామ పంచాయతీలు, నాలుగు అనుబంధ గ్రామాలకు ఉపయోగపడే విధంగా ఉదయం, సాయం త్రం వేళల్లో మేడ్చల్ డిపో నుంచి రెండు బస్సులను నడిపిస్తున్నారు. దీంతో మారుమూల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామానికో మినీ ఫంక్షన్‌హాల్
సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను ప్రవేశపెట్టి నిరుపేద ఆడపడుచుల పెండ్లికి రూ. లక్షా 116లను అందించి ఇంటికీ పెద్దన్నగా నిలిచాడు. కాగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా వచ్చిన డబ్బుల్లో ఎక్కువశాతం నిరుపేదలు ఫంక్షన్‌హాల్ కోసం, ఇతరత్రా ఖర్చుల కోసం వాడుకుంటున్నారు. దీనిని దృష్టిలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ గ్రామానికో మినీ ఫంక్షన్‌హాల్ ఏర్పాటు చేస్తే నిరుపేదలకు, గ్రామస్తులకు ఉపయోగకరంగా ఉంటుందని భావించి అనుకున్నదే తడువుగా మనోహరాబాద్ మండలానికి మొదటి విడతగా రామాయిపల్లి, ముప్పిరెడ్డిపల్లి, కూచారం, జీడిపల్లి, కోనాయిపల్లి పీటీ గ్రామాలకు ఐదు మినీ ఫంక్షన్హాల్లను మంజూరు చేసి, వెంట వెంటనే ప్రభుత్వం నుం చి నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం కొనాయిపల్లి పీటీ సగం వరకు పనులు జరుగగా, కూచారం, జీడిపల్లి గ్రామాల్లో మినీ ఫంక్షన్హాల్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక్కో మినీ ఫంక్షన్‌హాల్ నిర్మాణానికి రూ. 35లక్షల వ్య యాన్ని ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. మినీ ఫంక్షన్‌హాల్ పూర్తి నిర్వాహణ గ్రామ పంచాయతీపైనే ఉంటుంది. ఈ మినీ ఫంక్షన్హాల్లో ఏ శుభకార్యాన్ని అయిన పూర్తిగా ఉచితంగా జరుపుకోవచ్చు.
ఆక్సిజన్ పార్కులుగా అటవీప్రాంతం..
యాంత్రిక జీవనానికి దూరంగా, విషవాయువులు జాడలేని స్వచ్ఛమైన గాలిని అందించే ఆక్సిజన్ పార్కు లుగా నేడు తెలంగాణలోని అటవీ ప్రాంతాలు రూపుదిద్దుకుంటున్నాయి. అటవీ ప్రాం తాన్ని సుందరవనంగా రూపుదిద్ది, ఓ పర్యాటక ప్రాంతంగా మా ర్చేందుకు సీఎం కేసీఆర్ ఆక్సిజన్ పార్కులను ఏర్పాటు చేశారు. 44వ జాతీయ రహదారిపై వెళ్లే ప్రయాణికులకు సేద తీర్చడంతో పాటు, డివిజన్ పరిధిలోని ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించే రకరకాల జాతుల మొక్కలతో, సేద తీరేందుకు వివిధ రకాల ఆకారాలతో కూడిన కుర్చీలతో పాటు సకల హంగులతో రూపుదిద్దుకుంటుంది. మనోహరాబాద్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో 349 హెక్టార్ల రిజర్వు ఫారెస్ట్‌లో ఏర్పాటు చేసే ఈ రెండు ఆక్సిజన్ పార్కులు సం దర్శకులను ఆకట్టుకోబోతున్నాయి. మెదక్ జిల్లాలోనే మరో అతిపెద్ద పర్యాటక కేంద్రంగా రెండు ఆక్సిజన్ పార్కులు మనోహరాబాద్ మండలంలో ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. కలకత్తాకు చెందిన పలువురు శిల్పనైపుణ్యం పొందిన మేస్త్రీలతో వెలకం కమా న్లు, యోగా షెడ్లను, సిట్టింగ్ టేబుల్లను అందంగా నిర్మించారు.
రూ. 100కోట్లతో అతిపెద్ద రైల్వే వంతెన నిర్మాణం
మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే పనుల్లో భాగంగా మండలంలోని రామాయిపల్లి జాతీయ రహదారిపై రూ. 100కోట్లతో వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. కేవలం రైల్వే లైను కోసమే కాకుండా పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్‌లో ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా మనోహరాబాద్ మండలం రామాయిపల్లి వద్ద అత్యాధునిక టెక్నాలజీతో మూడు కిలోమీటర్ల వరకు ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఇప్పటి కే వంతెన నిర్మాణ పనులు సగం వరకు పూర్తి అయ్యా యి. వంతెన నిర్మాణ పనులను ఆగస్టు 29, 2019న మంత్రి హరీశ్‌రావు లాంఛనంగా ప్రారంభిం చి, ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలను నిర్వహిస్తూ వేగంగా వంతెన నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తియితే మెదక్ జిల్లాలోనే అతి పెద్ద రైల్వే వంతెనగా నిలిచి పోనుంది.
మినీట్యాంక్‌బండ్‌లుగా చెరువులు..
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలకు పూర్వ వైభవం ఏర్పడింది. ఈ పథకం ద్వారా చెరువు పూడికలు, ఎఫ్టీఎల్ లెవల్ వరకు స్థల సేకరణ, చెరువు కట్ట పునరుద్ధరణ పనులు చేపట్టడంతో పాటు కట్టకు ఇరువైపులా హరితహారం మొక్కల తో పాటు గీత కార్మికుల వృత్తిని కాపాడేందుకు ఈత మొక్కలను నాటారు. దీంతో నేడు చెరువులు, కుంటలు ఎండాకాలంలో సైతం నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉండగా గ్రామాల్లో ఉన్న ప్రతి చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్‌గా మార్చాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ దిశగా పంచాయతీ పాలకవర్గ సభ్యులు పనులు చేపడుతున్నారు. చెరువులు, కుంటలు నిండటంతో ప్రభు త్వం పంపిణీ చేసిన చేపపిల్లల పెంపకంతో మత్స్యకారులు ఆర్థికంగా లాభపడుతున్నారు.
నూతనంగా మరో రెండు పారిశ్రామిక వాడలు
టీఎస్ఐఐసీ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్) ద్వారా మనోహరాబాద్ మండలంలో ముప్పిరెడ్డిపల్లి, కాళ్లకల్‌లో 342, 354 సర్వే నంబర్లో 750ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటై ఉంది. అంతే కాకుండా కూచారంలో 148వ సర్వే నంబర్లో 82 ఎకరాల 20గుంటల్లో మరో పారిశ్రామిక వాడ ఉంది. వీటితో పాటు ఇటీవల నూతనంగా కొండాపూర్‌లో 191 ఎకరాల్లో మరో పారిశ్రామి క వాడ ఏర్పాటు కాబోతున్నది. దీని కోసం రైతులకు నష్టపరిహారం చెల్లించి స్థలాన్ని సేకరించి పనులు మొద లు పెట్టారు. ఇదిలా ఉండగా విదేశాల నుంచి వ్యాపారస్తులు, పెట్టుబడుదారులు తమ పరిశ్రమలను ఏర్పా టు చేసుకునేందుకు తెలంగాణ రాష్ర్టానికి వస్తుండటంతో మరో రెండు పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్న ల్ ఇచ్చింది. దీంతో మనోహరాబాద్ మండలంలోని రంగాయిపల్లి, పోతారం గ్రామా ల్లో పరిశ్రమల ఏర్పాటుకు స్థలం కావాలని టీఎస్ఐఐసీ ప్రతిపాదించింది. రంగాయిపల్లిలో 45ఎకరాలు, పోతారంలో 229 ఎకరాల భూమి అవసరముందని కోరింది. దీంతో ఆయా గ్రామాల్లో పారిశ్రామిక వాడల కోసం భూ సేకరణ చేసే పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు.
శరవేగంగా రైల్వే పనులు

తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రైల్వే ప్రాజెక్టుగా నిలువనున్న మనోహరాబాద్-కొత్తపల్లి పనులు వేగవంతం అయ్యాయి. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151కి.మీ రైలుమార్గం నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటి వరకు మనోహరాబాద్ నుంచి గజ్వేల్, కొడకండ్ల వరకు 46.5కిలోమీటర్ల వరకు రైల్వే పనులు పూర్తి కాగా రైల్వే సేప్టీ అధికారులు ట్రయల్న్‌న్రు సైతం నిర్వహించారు. కాగా రైల్వే లైను పనులతో పాటు రైల్వే స్టేషన్లను సైతం ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. మనోహరాబాద్‌లో ఇది వరకే పాత రైల్వేస్టేషన్ ఉండగా దానికి అనుకొని మరో పెద్ద రైల్వేస్టేషన్‌ను అన్ని హంగులతో నిర్మించారు. విశాలమైన ఫ్లాట్‌ఫారం, కుర్చునేందుకు సిమెంట్ చైర్లు, అత్యాధునిక వసతులతో బుక్కింగ్ కౌంటర్, వాహనదారులకు పార్కింగ్ కేంద్రా లను ఏర్పాటు చేశారు.