సిద్దిపేట, ఆగస్టు 4: సిద్దిపేట మెడికల్ కాలేజీకి మరో మూడు పీజీ మెడికల్ కోర్సులు మంజూరైనట్లు మాజీ మంత్రి,స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. కళాశాలలో 11 పీజీ కోర్సులతో 58 మంది విద్యార్థులతో విద్యాబోధన జరుగుతోందన్నారు.
కొత్తగా అనస్తీషియాలో 6 సీట్లు, పీడియాట్రిక్‌లో 4 సీట్లు, డె ర్మటాలజీలో 4సీట్ల తో కోర్సులు మం జూరైనట్లు తెలిపా రు. మొత్తంగా సి ద్దిపేట మెడికల్ కా లేజీలో 16 కోర్సు లు 72 సీట్లతో పీజీ విద్యాబోధన జరుగనుందన్నారు. రాష్ట్రంలో 16 పీజీ మెడికల్ కోర్సులున్న కాలేజీగా సిద్దిపేట మెడికల్ కాలేజీ రికార్డు సాధించిందన్నారు. కొత్తగా మూడు పీజీ కోర్సులు మం జూరు కావడంపై సంతోషం వ్యక్తం చేశారు.