చేర్యాల, ఏప్రిల్ 20 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో డోనర్ స్కీంలో భాగంగా 100 కాటేజీలు నిర్మించేందుకు ఆలయ ఈవో అన్నపూర్ణ ఇటీవల శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మొట్టమొదట గా హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన దాత వినోద్‌కుమార్ స్వాతి దంపతులు రూ.15లక్షల చెక్కును తల్లిశారద చేతుల మీదుగా ఆదివారం ఆలయ ఈవోకు అందజేశారు.
ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ స్వామి వారి క్షేత్రంలో తండ్రి విఠల్‌రావు జ్ఞాపకార్థం కాటేజీ నిర్మించేందుకు విరాళం అందజేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ మల్లన్న క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సమయంలో గదులు లభించక అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను పరిష్కరించేందుకు మల్లన్న క్షేత్రంలోని అన్నప్రసాద వితరణశాల సమీపంలో 100 కాటేజీలు నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించి నిధులు ఇవ్వాలని దాతలను కోరినట్లు తెలిపారు.
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన దాత రూ.15లక్షల విరాళం అందించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. దాత లు ముందుకు వచ్చిమల్లన్న క్షేత్రాభివృద్ధికి విరివిగా విరాళాలు అందించాలని ఆమె కోరారు. ఆలయ డీఈ మహిపాల్‌రెడ్డి, ఏఈ సతీశ్,సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.