తెలుగు యూనివర్సిటీ, నవంబర్ 19 : సాహిత్యకారులను తయారు చేసేందుకు పరిషత్తు పూనుకోవడం హర్షించదగిన విషయమని ప్రభు త్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నా రు. తెలంగాణ సారస్వత పరిషత్తు మొదటిసారిగా రాష్ట్రస్థాయి పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించిన కవిత, కథా, రచన పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం శుక్రవారం హైదరాబాద్ లోని దేవులపల్లి రామానుజరావు కళా ప్రాంగణం వేదికైంది. 78 ఏండ్ల సాహిత్య చరిత్ర కలిగిన సారస్వత పరిషత్తు వేదికపై విద్యార్థులు బహుమతులు అందుకోవడం అదృష్టంగా భావించాలన్నారు. విద్యతో పాటు సాహిత్యం, ఇతర అంశాలపై జ్ఞానాన్ని సముపార్జించి జీవితంలో ఉన్నతంగా రాణించాలని సూచించారు. పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో పాఠశాల స్థాయినుంచి సృజనాత్మక, రచనాభిరుచిని పెంచే లక్ష్యంతో తెలంగాణ సారస్వత పరిషత్తు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్న య్య మాట్లాడుతూ కరోనా కాలంలోనూ విద్యార్థుల నుంచి పోటీలకు అనూహ్య స్పందని వచ్చిందన్నారు. కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత చొక్కా పు వెంకటరమణ మాట్లాడుతూ భవిష్యత్‌లో మరిన్ని మంచి కవితలు వచ్చేందుకు ఈ పోటీలు దోహపదపడ్డాయన్నారు.
బాలచెలిమి వ్యవస్థాపకుడు ఎం.వేదకుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పిల్లలు ఉత్సాహంతో రచనలు చేస్తున్నారన్నారు. బాల సాహితీవేత్త దాసరి వెంకటరమణ మాట్లాడుతూ సంకల్పంతో రచనారంగంలో సృజనాత్మకతతో రాణించాలన్నారు. బాల సాహితీవేత్తలు డాక్టర్ వీఆర్ శర్మ, డాక్టర్ సిరి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఈ పోటీల విజేతలకు రూ.5 వేలు ప్రథమ బహుమతి, రూ.3 వేలు ద్వితీయ బహుమతి, రూ.2 వేలు తృతీయ బహుమతి, ప్రత్యేక బహుమతి కింద రూ.వెయ్యి నగదుతోపాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో సత్కరించారు. పరిషత్తు కోశాధికారి మంత్రి రామారావు, ప్రాచ్య కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ ఎ.సిల్మానాయక్, విద్యార్థు లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కాగా, కవితా రచనలో ఎం.భావన (మె దక్), చిత్రకవి నాగహాసిని (సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం) బహుమతులు అందుకున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన కె.స్ఫూర్తికి కథా బహుమతుల్లో తృతీయ బహుమతి లభించింది. కె.ఉదయ కిరణ్ (సంగారెడ్డి జల్లా ఐడీఏ బొల్లా రం), కె.ప్రవీణ్, టి.దీపిక (మెదక్ జిల్లా వెంకటాయపల్లి)కు వక్తలు ప్రత్యేక బహుమతులు అందజేశారు.