
రామాయంపేట, అక్టోబర్ 1: ఆడపడుచులకు బతుకమ్మ చీరెలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. శుక్రవారం జిల్లా కేంద్రం నుంచి రామాయంపేట మండలానికి 13110 చీరెలు వచ్చినట్లు రామాయంపేట ఎంపీడీవో యాదగిరిరెడ్డి తెలిపారు. ఈ సందర్భం గా అయన మాట్లాడుతూ రామాయంపేట మండంలోని అన్ని గ్రామాలకు 7960 చీరెలు వచ్చాయన్నారు. రామాయంపేట మున్సిపల్‌కు 5150 బతుకమ్మ చీరెలు వచ్చాయని ఆయన అన్నారు. శనివారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం, ఆర్యవైశ్య భవనంలో పట్టణవాసులకు చీరెలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. చీరెలను తీసుకునేందుకు పట్టణ, మండల వాసులు పెద్ద సంఖ్యలో రావాలని ఎంపీడీవో యాదగిరిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్ తెలిపారు.
నర్సాపూర్‌లో..
నర్సాపూర్,అక్టోబర్ 1: తెలంగాణ ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరెలను శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం నుంచి మండల పరిధిలోని గ్రామ పంచాయతీలకు పంపిణీ చేశారు . ఈ సందర్భంగా ఎంపీడీవో మార్టిన్ లూథర్ మాట్లాడుతూ గ్రామ పం చాయతీలకు 9600 చీరెలను పంపిణీ చేశారని తెలిపారు. రెండు రో జుల్లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అందజేస్తారని వెల్లడించారు