
కొండాపూర్, అక్టోబర్ 17 : ప్రతి పేదోడికి ఇల్లు కట్టించాలనే ప్రభుత్వం సంకల్పం నెరవేరింది. పేదోడి సొంతింటి కలను సాకారం చేసింది. నిరుపేదలను గ్రామ సభల ద్వారా గుర్తించి నేరుగా వారి చేతుల్లోనే పట్టాలను పంపిణీ చేసింది. కొండాపూర్ మండలం అలీయాబాద్, కొండాపూర్, తొగర్పల్లి గ్రామాలలోని 50 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను ప్రభుత్వం అందజేసింది. అలీయాబాద్ గ్రామానికి 10 ఇండ్లు, తొగర్పల్లికు 20, కొండాపూర్‌కు 20 చొప్పున మొత్తం 50 ఇండ్లు అందించారు. కొండాపూర్ మండలంలోని మూడు గ్రామాల లబ్ధిదారులకు రూ.13 కోట్లతో 50 ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. పేదలకు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం తలపెట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లను లాటరీ పద్ధతిన అందించారు. సొంతింటి కల నెరవేరినందుకు పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వం పక్కా ఇం డ్లను కట్టించి వారికి అందించింది. సంగారెడ్డి మాజీ ఎమ్మె ల్యే చింతా ప్రభాకర్ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించారు. డబుల్ బెడ్రూం ఇండ్లలో లబ్ధిదారులు సంతోషంగా జీవనం గడుపుతున్నారు. ప్రభుత్వం గరీబోళ్లకే డ బుల్ ఇండ్లను నిర్మించి ఇవ్వడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..
డబుల్ బెడ్రూం ఇండ్ల మంజూరులో నన్ను ఎంపిక చేయ డం చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ప్రభుత్వం మాకు మరిచిపోలేని కానుక ఇచ్చిం ది. పక్కా ఇల్లు నిర్మించాలంటే ఎన్నో లక్షలు ఖర్చు అయ్యేది. మాకు నయా పైస ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించి ఇచ్చారు. సీఎం కేసీఆర్ సారుకు ధన్యవాదాలు.