
మెదక్, అక్టోబర్ 1 : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం మెదక్ జిల్లాలో శనివారం నుంచి ప్రారంభమవుతున్నది. కలెక్టర్ ఎస్.హరీశ్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని 18 సంవత్సరాల నిం డిన మహిళలందరికీ ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరెలు ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. జిల్లాలోని 21 మండలాలకు బతుకమ్మ చీరెలను వచ్చాయి. శనివారం నుంచి అన్ని గ్రామాల్లో రేషన్ డీలర్లు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 21 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల్లో 521 రేషన్ దుకాణాల ద్వారా 2లక్షల 11 వేల చీరెలను పంపిణీ చేయ నున్న ట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో 2, 82, 330 మంది మహిళలు ఉండగా, ఇప్పటి వరకు 2.11 లక్షల చీరెలు వచ్చాయని తెలిపారు. వీటిని మెదక్ మార్కెట్ కమిటీలోని గోదాము లు, నర్సాపూర్లోని సీఎల్ఆర్సీ భవనంలో భద్రపరిచారు. అల్లాదుర్గం 11058 ,చేగుంట 16661, చిలిపిచేడ్ 7690 హవేళీఘనపూర్ 15711 , కౌడిపల్లి 13298 , కొల్చారం 135 21, మనోహరాబాద్ 9260, మెదక్ 10395, నర్సాపూర్12611, నార్సింగి 6989, నిజాం పేట 10667, పాపన్నపేట 205 08, రామాయంపేట 10745, రేగోడ్ 8000, పెద్దశ ంకరంపేట 14323, చిన్నశంకరంపేట 15407, శివ్వంపేట 15935, టేక్మాల్ 13633, తూప్రా న్ 6754 , వెల్దుర్తి 16673, మెదక్ మున్సి పాలిటీ 14255, నర్సాపూర్ మున్సిపాలిటీ 5409 ,తూప్రాన్ మున్సిపాలిటీ 7677 రామాయంపేట మున్సిపాలిటీ5150 మొత్తం 2,82 ,330 చీరెలను పంపిణీ చేయనున్నట్లు అధి కారులు తెలిపారు.
చిన్నశంకరంపేటలో బతుకమ్మ చీరెల పంపిణీ
చిన్నశంకరంపేట,అక్టోబర్1: చిన్నశంకరంపేట మండలంలో శనివారం నుంచి బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తామని ఎంపీడీవో గణేశ్రెడ్డి శుక్రవారం తెలిపారు. మండలానికి 10400 బతుకమ్మ చీరెలు వచ్చాయన్నారు. బతుకమ్మ చీరెలను గ్రామాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు రేషన్డీలర్లతో మహిళలకు అందజేస్తారన్నారు.