
కొల్చారం, నవంబర్ 20: మండల పరిధిలోని చిన్న ఘనపూర్ సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని అక్టోబ ర్ 29వ తేదీన ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ప్రారంభించగా అదే రోజు కొనుగోళ్లు ప్రారంభమైనాయి. వానకాలం ధాన్యం కొనుగోలు ఇప్పటి వరకు సుమారుగా 150 లారీలు, ట్రాక్ట ర్లు (36వేల క్వింటాళ్ల) ధాన్యం తూకం వేసి రైస్ మిల్లులకు తరలించారు. 35 మంది రైతులకు రూ.86 లక్షల వరకు బిల్లుల చెల్లించారు. మరో వారం రోజుల్లో గ్రామంలో ధా న్యం కొనుగోలు పూర్తి కానుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వానకాలంలో సుమారుగా 1750 ఎకరాల్లో వరినాట్లు వేశారు. వరికోతలు ముందుగా ప్రారం భం కావడంతో ధాన్యం తూకంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సొసైటీ చైర్మన్ నాగులు నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రానికి ఇన్చార్జిగా మలేశంను నియ మిం చారు. హమాలీల కొరత రాకుండా బీహార్ హమాలీలను తూకం వేసేందుకు ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పటి కప్పుడు గన్నీబ్యాగులు తెప్పించుకోవడంతో పాటు రైతులకు సక్రమ ంగా ధాన్యం కొనుగోలు చేయడానికి టోకెన్లు ఇచ్చారు. వ రుసక్రమంలో ధాన్యాన్ని తూకం వేయ డంతో పాటు రైసు మిల్లులకు తరలించి అన్లోడింగ్ అయ్యే వరకు నిర్వా హకులు అప్రమత్తంగా వ్యవహరించడంతో సు మారుగా 150 లారీలు, ట్రాక్టర్లు తూకం వేశామని కేంద్రం ఇన్చార్జి మల్లేశ్ తెలిపారు.
రైతుల సహకారంతో ధాన్యం తరలింపు
కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యానికి వరుస క్రమంలో టో కెన్లు ఇచ్చాం. హమాలీలు, లారీల సమస్య రాకుండా ఎప్పటికప్పు డు సొసైటీ పాలకవర్గం చర్యలు తీసుకోవడంతో సకాలంలో ధా న్యం తూకం అవుతుంది. మరో వా రం రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తవుతుంది.
– మల్లేశ్, కొనుగోలు కేంద్రం ఇన్చార్జి