డప్పు చప్పుళ్ల హోరు.. అతివల కోలాటాలు.. యువతీయువకుల నృత్యాలు.. చిన్నారుల కేరింత మధ్యన జిల్లావాసులు గౌరీసుతుడికి ఘనవీడ్కోలు పలికారు. నవరాత్రుల నుంచి ఘనమైన పూజలందుకున్న గణేశుడిని, శనివారం విద్యుద్దీపాలతో అలంకరించిన వాహనాల్లో ఉంచి కనుల పండువలా శోభాయాత్రలు తీశారు. దారిపొడవునా జనం నీరాజనం పట్టగా, చెరువులు, కాలువల్లో నిమజ్జనం చేశారు. ‘పోయిరా గణపయ్యా పోయిరా’ అంటూ సాగనంపారు.