
హవేళీఘనపూర్, నవంబర్ 1: రైతులకు మద్దతు ధర కల్పించడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని హవేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని బొగుభూపతిపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ శేరినారాయణరెడ్డి, మెదక్ పీఎసీఎస్ సొసైటీ చైర్మన్ హన్మంత్‌రెడ్డి ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రైతులు ధా న్యా న్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. రైతులు ధా న్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నా రు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ రా జయ్య, మెదక్ పీఎసీఎస్ సీఈవో సాయికుమార్, ఏఈవో ప్రశాంత్, జయపాల్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
సర్దనలో..
మండల పరిధిలోని సర్దనలో వైస్ ఎంపీపీ రాధాకిషన్‌యాదవ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కా ర్యక్రమంలో జిల్లా టీఆర్ఎస్ నాయకుడు సతీష్‌రావు, గ్రా మస్తులు శ్రీనివాస్, రాజేశ్వర్‌రావుతో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.
మెదక్రూరల్లో …
మెదక్‌రూరల్ నవంబర్ 1: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ పీఏసీఎ స్ చైర్మన్ హనుమంత్‌రెడ్డి అన్నారు. మెదక్ మండలంలోని మాల్కాపూర్ తండా , ర్యాలమడుగు, , శివ్యాయిపల్లి లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను హనుమంత్‌రెడ్డి ,సర్పంచ్‌లతో కలిసి ప్రారభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సరోజమోహన్, రజిని భిక్షపతి టీఆర్ఎస్ నాయకులు ప్రారభించారు.
మాచవరంలో
మండల పరిధిలోని సంగాయిగూడ తం డా లో మాచవరం పీఏసీఎస్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ చైర్మన్సీతారామయ్య , సర్పంచ్ తు ల సి రవి తో కలిసి ప్రారంభించారు.
చల్మెడ ఐకేపీ ఆధ్వర్యంలో
నిజాంపేట, నవంబర్1: చల్మెడలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పా టు చేయాలని సర్పంచ్ నర్సింహారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌ను కోరారు. సర్పంచ్ నర్సింహారెడ్డి, ఉపసర్పంచ్ రమేశ్‌తో కలిసి అదనపు కలెక్టర్‌తో పాటు డీఆర్డీవో శ్రీనివాస్ కలిసి గ్రామ పంచాయతీ, మహిళ సంఘం సభ్యు ల తీర్మానాలను అందజేశారు. స్పందించి ఐకేపీ ఆధ్వర్యం లో కొనుగోలు కేం ద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు.
చిన్నశంకరంపేటలో..
చిన్నశంకరంపేట, నవంబర్ 1: ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, ఏవో శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణగౌడ్, స్వామి, బాలకృష్ణయ్య్డ తదితరులున్నారు.
మెదక్ మున్సిపాలిటీలో..
మెదక్ మున్సిపాలిటీ, నవంబర్1: రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మెదక్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ హనుమంత్‌రెడ్డి అన్నారు. ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో పిల్లికోటాల్లో కొనుగోలు కేంద్రాన్ని సహకార సంఘం వైస్ చైర్మన్ సూర్యతేజ, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, తహసీల్దార్ భానుప్రకాశ్‌తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్ రాము లు, సహకార సంఘం సీఈవో సాయికిరణ్ పాల్గొన్నారు.