మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 29: మెదక్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ పేర్కొన్నారు. మెదక్ కలెక్టరేట్లో సోమవారం నీటిపారుదలశాఖ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, పోలీస్, అటవీశాఖ, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు తప్పకుండా ఇసుక కొనుగోలు నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ప్రభుత్వ నిర్మాణాల కోసం అవసరమైన ఇసుకను సాండ్ బజార్లో నిల్వ చేస్తామన్నారు.
ఇప్పటికే నర్సాపూర్‌లో సాండ్ బజార్‌ను ప్రారంభించామని, త్వరలో మెదక్‌లో ప్రా రంభిస్తామని తెలిపారు.సంబంధింత ఇంజినీరింగ్ శాఖ అధికారులు ఒక ఫార్మాట్ అందిస్తారని, ఇసుక అవసరాలను అందులో పొందుపర్చి అందజేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఎక్కడైనా అక్రమ ంగా మైనింగ్ జరుగుతున్నట్లు సమాచారం ఉంటే తెలియజేయాలని సూచించారు. చట్టాలకు అనుగుణంగా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. అక్రమంగా ఇసుక రవాణా చేసే ప్రాంతాల్లో సీసీకెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపడుతామన్నారు.
సీసీ కెమెరాల ఆధారంగా కేసులు నమోదు చేస్తామన్నారు. అటవీ ప్రాంతాల నుంచి ఇసుక రవాణా జరుగుతుందనే సమాచారం ఉందని, అటవీశాఖ అధికారులు తనిఖీ చేసి ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, ఆ ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మెదక్ జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్వో భుజంగరావు, మెదక్, నర్సాపూర్ ఆర్డీవోలు రమాదేవి, మహిపాల్‌రెడ్డి, డీఆర్డీవో శ్రీనివాస్‌రావు, ఆర్ఐ లక్ష్మీనారాయణ, మైనింగ్ ఈడీ సంజయ్‌కుమార్, మెదక్ డీఎ స్పీ ప్రసన్నకుమార్, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.