
నర్సాపూర్,అక్టోబర్18: నర్సాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ అన్నారు. సోమవారం నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నాల్గోవార్డులో ఎస్బీఐ బ్యాంకు నుంచి గాంధీ విగ్రహం వరకు నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 25 కోట్లు, మున్సిపల్ అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. నేడు రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించామని తెలిపారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళాకమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి సహాయ సహకారాలతో ము న్సిపల్ అభివృద్ధికి పాటుపడుతునన్నారు. అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశా రు.కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, మున్సిపల్ కమిషనర్ అశ్రిత్‌కుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ హబీబ్‌ఖాన్, టీఆర్ఎస్ నాయకులు రమేశ్‌యాదవ్, మాజీ సర్పంచ్ రమణారావు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
తూప్రాన్/రామాయంపేటలో…
తూప్రాన్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తయారు చేస్తానని మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్‌గౌడ్ అన్నారు. తూప్రాన్ పట్టణంలోని ఒకటో వార్డులో పర్యటించి మురుగు కాల్వలు, రోడ్లను పరిశీలించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం చైర్మన్ మాట్లాడారు.పట్టణంలో సమస్యలు లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పట్టణంలో భగీరథ నీటిని ఇంటింటికీ అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.వార్డులో ఏ సమస్య ఉన్నా తనకు నేరుగా గాని వార్డు కౌన్సిలర్లకు తెలుపాలన్నారు చైర్మన్ వెంట వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.