
మెదక్ మున్సిపాలిటీ 18: మెదక్ జిల్లాలోని చేగుంట అప్ గ్రేడ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో ఇంగ్లిష్, గణిత, ఆర్థిక, వాణిజ్య, పౌరశాస్ర్తా అధ్యాపక పోస్టులతో పాటు మెదక్ బాలికల గురుకులంలో గణితం, భౌతికశాస్త్రంలో, నర్సాపూర్ బాలికల గురుకులంలో ఇంగ్లిష్, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం , నర్సాపూర్ బాలుర గురుకులంలో తెలుగు, చేగుంట బాలికల గురుకులంలో ఇంగ్లిష్ ఉపాధ్యాయ పోస్టు ఇంగ్లిష్ మీడియంలో పార్ట్ టైం పద్ధ్దతిన బోధించేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ రిజినల్ కో ఆర్డినేటర్ సంపత్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 20వ తేదీ నుంచి 27 వరకు మెదక్ మినీ గురుకులంలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో సెకండ్ డివిజన్ (55 శాతం) మార్కులతో పీజీ, బీఈడీ, టెట్ పేపర్-2 అర్హతలు పూర్తి చేసిన ఉండాలన్నారు. బాలికల గురుకులాల్లో మహిళలు మాత్రమే అర్హులన్నారు. అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఈనెల 30న నర్సాపూర్లోని అల్లూరి సీతరామారాజు గురుకులంలో డెమోలు నిర్వహిస్తామన్నారు.
చిన్నశంకరంపేటలో..
చిన్నశంకరంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండు గెస్ట్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అర్హులైన అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ నాగేందర్ సోమవారం తెలిపారు.
రాజనీతిశాస్త్రం (సివిక్స్), షార్ట్ అండ్ టైప్ రైటింగ్ (ఓకేషనల్) రెండు గెస్ట్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. రాజనీతిశాస్త్రం పోస్టుకు పోలిటీకల్ సైన్స్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పీజీలో 50శాతానికి పైగా మార్కులు కలిగిన అభ్యర్థులు అర్హులు అన్నారు. షార్ట్ అండ్ టైప్ రైటింగ్ పోస్టుకు బీఏ, బీకాం. బీఎస్సీలో డిగ్రీతో పాటు షార్ట్ అండ్ హైయర్ గ్రేడ్ ఇంగ్లిష్ , టైప్ రైటింగ్ పైన గ్రేడ్ ఇంగ్లిష్లో సర్టిఫికెట్ కలిగి ఉండాలన్నారు.
ఈ సర్టిఫికెట్ స్టేట్బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారిచే జారీ చేయబడినవై ఉండాలన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారానికి విద్యార్హత సర్టిఫికెట్ జిరాక్స్ కాఫీలను జత చేసి ఈ నెల 20 సాయంత్రం 4గంటల్లోగా చిన్నశంకరంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అందించాలని సూచించారు.