మంగళవారం 19 జనవరి 2021
Mancherial - Jan 11, 2021 , 01:36:11

గ్రామీణ రహదారులకు మహర్దశ

గ్రామీణ రహదారులకు మహర్దశ

  • అలసత్వం వహిస్తే చర్యలు 
  • మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు
  • దండేపల్లి, మామిడిపెల్లిలో సీసీ రోడ్లు ప్రారంభం

దండేపల్లి, జనవరి 10 : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే గ్రామీణ రహదారులకు మహర్దశ వచ్చిందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. మండల కేంద్రంతో పాటు పాత మామిడిపెల్లిలో ఎస్డీఎఫ్‌ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను స్థానిక నాయకులతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదన్నారు. దండేపల్లి మండలాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని తెలిపారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు, అబద్ధాలను తిప్పికొట్టాలని సూచించారు. బీజేపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, లేకపోతే ప్రజలు తరిమికొడతారన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. పాత మామిడిపెల్లిలో ఎమ్మెల్యే దివాకర్‌రావు కాలినడకన ఊరంతా పర్యటించి, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. లక్షెట్టిపేట సీఐ నారాయణ్‌ నాయక్‌ ఆధ్వర్యంలో ముగ్గురు ఎస్‌ఐలు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో నడిపెల్లి ట్రస్ట్‌ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ యువ నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్‌ గురువయ్య, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు చుంచు శ్రీనివాస్‌, కార్యదర్శి బండారి వెంకటేశ్‌, వైస్‌ ఎంపీపీ అనిల్‌, మాజీ ఎంపీపీ గోళ్ల మంజుల, మాజీ వైస్‌ ఎంపీపీ ఆకుల రాజేందర్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు కాసనగొట్టు లింగన్న, సురేశ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ రేని శ్రీనివాస్‌, సర్పంచ్‌ శ్రీనివాస్‌, ఎంపీటీసీ ఎల్తపు శిరీష, టీఆర్‌ఎస్‌ యూత్‌ మండలాధ్యక్షుడు గాండ్ల నరేశ్‌, కార్యదర్శి అల్లంల సంతోష్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు గడిపెల్లి సత్యం, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

రైతు బీమా నగదు బదిలీ పత్రం అందజేత..

కన్నెపల్లి గ్రామానికి చెందిన రైతు గంగాధరి సత్తయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, మంజూరైన బీమా సొమ్ముకు సంబంధించిన రూ.5 లక్షల నగదు బదిలీ పత్రాన్ని భార్య పద్మకు ఎమ్మెల్యే దివాకర్‌ రావు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, సర్పంచ్‌ గడికొప్పుల రజిని, మాజీ సర్పంచ్‌ మగ్గిడి శ్రీనివాస్‌, మాజీ ఎంపీటీసీ ముత్తె నారాయణ, నాయకులు గంగాధరి సతీశ్‌, ముత్తె మల్లేశ్‌, శంకరయ్య పాల్గొన్నారు.

తెలంగాణ జాగృతి క్రికెట్‌ పోటీలు ప్రారంభం..

మంచిర్యాల అర్బన్‌, జనవరి 10 : మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో తెలంగాణ జాగృతి క్రికెట్‌ కప్‌-2021 పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడుతాయన్నారు. అంతకుముందు ఇరుజట్ల క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. మొదటి రోజు సిద్ధిపేట, 8 ఇైంక్లెన్‌ జట్లు తలపడ్డాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అరవింద రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజయ్య, వైస్‌ చైర్మన్‌ ముఖేశ్‌గౌడ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లె భూమేశ్‌, కౌన్సిలర్‌, నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.