బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Sep 09, 2020 , 02:24:52

మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు

మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు

సీసీసీ నస్పూర్‌: నాయీబ్రాహ్మణులను ఆదుకోవడానికి కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్‌కు మంచిర్యాల జిల్లా నస్పూర్‌ మండల నాయీబ్రాహ్మణ సం ఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల తీరును  సంఘం నాయకులు మంత్రి కేటీఆర్‌ను కలిసి  విన్నవించారు. దీంతో ఆయన స్పందించి నాయీబ్రాహ్మణ వృత్తి చేపడుతున్న వారి వివరాలు సేకరించాలని బీసీ సంక్షేమ శాఖను ఆదేశించారు.   దీనిలో భాగంగా నస్పూర్‌ మండలానికి చెందిన నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు మంగళవారం ఈ ప్రాంత క్షౌరవృత్తిదారుల జాబితాను బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారికి అందజేశారు.  తమ విన్నపం మేరకు క్షౌరవృత్తిదారులను ఆదుకోవడానికి మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో జబితాను సేకరించడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు.  సంఘం నాయకులు జంపాల చంద్రయ్య, కుర్మిళ్ల చం ద్రయ్య, విజ్జగిరి రవి, ఎనగందుల వెంకటేశ్‌, పం దిర్ల యాదగిరి, మారారి రవి, మిడిదొడ్డి శ్రీనివాస్‌, కుర్మిళ్ల రాజ్‌మోహన్‌, తదితరులు పాల్గొన్నారు.  


logo