ఆర్కే న్యూటెక్‌పై ప్రమాద సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన
శ్రీరాంపూర్, ఏప్రిల్ 26 : శ్రీరాంపూర్ ఆర్కే న్యూ టెక్ గనిపై రెస్క్యూ స్టేషన్ ఇన్చార్జి జక్కారెడ్డి, మే నేజర్ స్వామిరాజు ఆధ్వర్యంలో సోమవారం ని ర్వహించిన రెస్క్యూ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గనుల్లో, ఓసీపీల్లో ప్రమాదాలు జరిగినప్పుడు తప్పించుకునేందుకు సేఫ్టీ పరికరాలపై కార్మికులు అవగాహన కలిగి ఉండాలని వారు సూచించారు. వేసవిలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని, వాటినుంచి రక్షించుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్స చేసే విధానాన్ని వివరించారు. అనంతరం గనిపై రెస్క్యూ సిబ్బంది ఫైర్ సేఫ్టీపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రదర్శన ఇచ్చారు. అలాగే గుండెపోటు వచ్చినప్పుడు ప్రథ మ చికిత్స ద్వారా, సెల్ఫ్ రెస్క్యూ ఫైర్ సిలిండర్ ద్వారా ఎలా కాపాడుకోవాలో చేసి చూపించారు. సేఫ్టీ ఆఫీసర్ అజయ్‌కుమార్, డిప్యూటీ మేనేజర్ రాసమల్ల లింగయ్య, రమేశ్, ఈఈ రాజగోపాలాచారి, సీనియర్ పీవో సృజన టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి శ్రీరాములు పాల్గొన్నారు.