Betting | శనివారం నుండి ప్రారంభమయ్యే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లో యువత బెట్టింగ్‌ల వైపు చూడకుండా బెట్టింగ్ నియంత్రించాలని కోరుతూ ఇవాళ మరికల్ యువకమండలి సభ్యులు మరికల్ ఎస్సై రాముకు వినతి పత్రం సమర్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలీసులు బెట్టింగ్ నియంత్రణకై ప్రత్యేక నిఘా కార్యక్రమాలను నిర్వహించాలని.. బెట్టింగ్ పాల్పడుతున్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరారు.
ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా యువత బెట్టింగ్ వ్యసనానికి అలవాటు పడి తమ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి ప్రత్యేక నిదాన ఏర్పాటు చేసి బెట్టింగ్ పాల్పడుతున్న వారి పట్టుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన ఎస్సై మెడికల్ రాము గ్రామాల్లో ఐపీఎల్ సమయంలో ఖచ్చితంగా పోలీసులు నిఘాలు ఏర్పాటు చేసి ఆన్లైన్లో కానీ ఆఫ్‌లైన్‌లో కానీ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వారిపై ప్రత్యేకంగా నువ్వు ఏర్పాటు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు.
బెట్టింగ్ నియంత్రణపై యువకులు ముందుకు రావడం అభినందనీయమని యువకమండలి సభ్యులను ఎస్సై అభినందించారు. గ్రామాల్లో బెట్టింగ్ పాల్పడుతున్నట్టు తెలిస్తే వెంటనే మరికల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువక మండలి అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డితోపాటు పలువురు యువకులు పాల్గొన్నారు.
Vishnupriya | బెట్టింగ్ యాప్ కేసు.. విష్ణుప్రియ ఫోన్‌ని సీజ్ చేసిన పంజాగుట్ట పోలీసులు