జీవితంలో స్థిరపడడమే ముఖ్యం
జీవితంలో ముందుగా స్థిరపడడమే ముఖ్యమని యువతు లు గుర్తుంచుకోవాలని చైతన్య మహిళా సం ఘం జిల్లా అధ్యక్షురాలు రాజేశ్వరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్టేట్ హోంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు.
మహబూబ్‌నగర్, మార్చి 8 : జీవితంలో ముందుగా స్థిరపడడమే ముఖ్యమని యువతులు గుర్తుంచుకోవాలని చైతన్య మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు రాజేశ్వరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్టేట్ హోంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ యువతులు ముఖ్యంగా వయసులో తప్పిదా లు చేయకూడదని, తప్పులు మార్గాల వైపు పయనించవద్దన్నారు.
మహిళలకు సముచిత స్థానం కల్పిద్దాం
మహిళలకు సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని వివిధ సంఘా ల నాయకులు రాచాల మురళి, నాచారం శ్రీనివాస్‌యాదవ్, బుర్ర సురేశ్, గోరింటా దినేశ్ భూపతి, వెంకట్ అన్నారు. పట్టణంలోని రోడ్డు కు ఇరువైపులా చిరువ్యాపారం చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తున్న మహిళలను ప్రపం చ మహిళా దినోత్సవం సందర్భంగా శాలువా, పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో స్టేట్‌హోం అధికారులు సృజన, నర్మద, నవ్య, గోపాలకృష్ణ ఉన్నారు.
అనాథాశ్రమంలో..
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, మార్చి 8 : రె డ్‌క్రాస్ సన్నిధి అనాథాశ్రమంలో గిరిజామాత ఉమెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం నిర్వహించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఏనుగొండలోని అనాథాశ్రమం లో ఉమెన్స్ క్లబ్ చైర్మన్ బి.సుప్రియ ఆధ్వర్యం లో ఆశ్రమానికి రూ.12వేల విలువైన స్టీల్ బకె ట్లు, ప్రెషర్ కుక్కర్, స్టీల్ ట్రేస్, ప్లేట్లు తదితర వస్తువులు అందజేశారు. పిల్లలకు పండ్లు, బ్రె డ్డు పంచారు. రెడ్‌క్రాస్ చైర్మన్ లయన్ నటరా జ్, అధ్యక్షుడు ప్రభ, సెకట్రరీ లిఖిత, ట్రెజరర్ చంద్రిక, సావిత్రి, పుణ్యవతి, శిరీష ఉన్నారు.
మూసాపేటలో..
మూసాపేట, మార్చి 8 : మండలంలోని కొ మిరెడ్డిపల్లిలో శుక్రవారం మహిళా దినోత్సవా న్ని ఘనంగా జరుపుకొన్నారు. గ్రామానికి చెం దిన కొమిరెడ్డిపల్లి వెలుగు గ్రామ సంఘం ఆధ్వర్యంలో మహిళా సంఘం సభ్యులకు ఆటలు, పాటల పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు.
మహిళలు స్వశక్తితో ఎదగాలి
జడ్చర్లటౌన్, మార్చి 8: జడ్చర్లలోని చేయూ త రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కే కు కట్ చేసి మహిళా దినోత్సవాన్ని జరుపుకొన్నారు. టైలరింగ్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. వాసవీక్లబ్, వనితాక్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ప్రభు త్వ దవాఖానలో విధులు నిర్వర్తిస్తున్న మహిళ వైద్యులు, నర్సులను శాలువాలతో సత్కరించా రు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఉమెన్స్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యేశ్వర ఆశ్రమంలో సేవలందిస్తున్న మహిళలను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో చే యూత రూరల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్పర్సన్ మర్తడేవిడ్, వనితాక్లబ్ అధ్యక్షురాలు రజి త, వాసవీక్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్, ఉమెన్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు బాలమ ణి, ప్రదీప్, ప్రవీణ్, రాధాకృష్ణ ఉన్నారు.
మహిళా పోలీసులకు సన్మానం
నారాయణపేట/నారాయణపేట టౌన్, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో శు క్రవారం సర్కిల్ పరిధిలో విధులు నిర్వహిస్తు న్న మహిళా పోలీసులను శాలువాతో సన్మానిం చి, బహుమతులు అందజేశారు. ఈ సందర్భం గా టౌన్ ఎస్సై వెంకటేశ్వర్లు, రూరల్ ఎస్సై కృష్ణదేవ్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేసే మహిళా అధికారులు, సిబ్బంది తమ కుటుంబాన్ని చూసుకుంటూ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించడం ప్రశంసనీయమన్నారు. అనంతరం దామరగిద్ద ఎస్సై వసంత, మహిళా కానిస్టేబుళ్లు అనిత, వెంకటేశ్వరమ్మను సన్మానించారు. నేటి సమాజంలో మహిళలు అనేక రంగాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని డీఈ వో కార్యాలయ సెక్టోరియల్ అధికారి నాగార్జునరెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు క్రీ డా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన పోటీలను ప్రారంభించి మాట్లాడారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమం లో ఏఎస్సై ఆంజనేయులు, కానిస్టేబుళ్లు హనుమంతు, శివ, యాదయ్య, హోంగార్డులు రఘు, శ్రీనివాసులు, ఖలీల్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ, పర్వీన్, శ్రీలత పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

