పాలమూరు, ఆగస్టు 25 : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో వినాయకచవితి సందర్భంగా వినాయకుల విగ్రహాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. పాత పాలమూరులోని శివాలయం వద్ద శ్రీకాంత్కుమార్చారి గత పదేండ్లుగా పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా మట్టి వినాయకులను తయారు చేసి అందుబాటులో ఉంచారు.
రకరకాల కెమికల్స్‌తో తయారు చేస్తున్న వినాయకులను ప్రతిష్ఠించి చెరువులు, కుం టలు, నదిలో నిమజ్జనం చేయడం వలన భవిష్యత్‌లో జలకాలుష్యం, వాయు కాలుష్యం ఏర్పడి మానవాళికి ముప్పు వాటిల్లనుంది. అందుకే ప్రజలందరూ కూడా మట్టి వినాయకులను స్థాపించి పర్యావరణాన్ని రక్షించాలని శ్రీకాంత్కుమార్చారి కోరారు.