నారాయణపేట టౌన్, న వంబర్ 26 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జిల్లాను అ న్ని రంగాల్లో అభివృద్ధి చే సేందుకు కృషి చేయాలని జె డ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. పట్టణంలోని శీలా గార్డెన్ ఫంక్షన్ హాల్లో శనివారం జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలను పరిష్కరించి, ఆ విషయాలను తదుప రి సమావేశాల్లో పొందుపర్చాలని సూచించారు.
ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి మాట్లాడుతూ చెరువులో చేపపిల్లలను వదిలేందుకు వెళ్లిన సమయం లో చెరువు కట్టలపై కంపచెట్లు కనిపిస్తున్నాయని, ఉపాధి హామీ పథకం నుంచి వాటిని తొలగించే లా చర్యలు తీసుకోవాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారికి సూచించారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు వేశామని, ఫార్మేషన్ రోడ్లు వేయించాలన్నారు. ఆసరా పింఛన్ల ఫారాలు ఆన్లైన్ చే యడంలో నిర్లక్ష్యం కారణంగా అర్హులకు ఫించన్లు మంజూరు కాలేదని, సిబ్బంది పనితీరు మార్చుకొని సకాలంలో దరఖాస్తులను ఆన్లైన్ చేయాలన్నారు. జిల్లాకు పూర్తిస్థాయి డీఈవోను కేటాయిం చే విధంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుదామని జెడ్పీటీసీలను కోరారు.
అధికారులు పూర్తి సమాచారంతో సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. పాఠశాలల్లో బయోమెట్రిక్ విధా నం అమలు చేయాలని, ఏఈవోలు క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, వి ద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలల నుంచి ఎ క్కువగా ఉన్న పాఠశాలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని పలువురు ప్రజాప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, కలెక్టర్ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్, జె డ్పీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.